Balagam Movie Review In Telugu & rating: 3/5
నటీనటులు: ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం,
దర్శకుడు : వేణు యెల్దండి
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
Balagam Movie Review In Telugu : జబర్దస్త్ వేణు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా బలగం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలరు అలాగే టీజర్, పోస్టర్లు సినిమాపై ఆసక్తి కలిగే చేశాయి. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన బలగం సినిమా ఈరోజు విడుదల కాటన్ జరిగింది. మరి ఎలా ఉందో చూద్దాం పదండి.
Balagam Movie Review In Telugu : కథ: సినిమా కథ విషయానికి వస్తే దర్శకుడు వేణు పల్లెటూరు లో జరిగే మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో వాళ్ళ సంప్రదాయాలు ఎలా ఉంటాయో అనే కదా అంశంతో మన ముందుకు వచ్చారు. కొమురయ్య (సుధాకర్ రెడ్డి) మనవడు సాయిలు (ప్రియదర్శి) పెళ్ళికి రెడీ అవుతాడు.
రెండు రోజుల్లో వరపూజ (నిశ్చితార్థం) అనగా… అతని తాతయ్య కొమురయ్య (సుధాకర్ రెడ్డి) చనిపోతాడు. వరపూజ రోజున పది లక్షల కట్నం వస్తే అప్పు తీరుద్దామని ఆశ పడిన అతనికి నిరాశే మిగులుతుంది. చావు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా ఆ పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పటికే సాయిలు అప్పుల్లో మునిగిపోతాడు. కుటుంబ సభ్యుల మధ్య అహంకార గొడవలు చనిపోయిన ఆత్మను ఎలా బాధపెడతాయి? మొత్తం సెటప్‌లో కొమరయ్య మనవడు సాయిలు(ప్రియదర్శి) పాత్ర ఏమిటి అనేది కీలకమైన కీలకాంశం.
నటీనటులు: కొమరయ్య కుటుంబ సభ్యులుగా నటించిన నటీనటులు తమ వంతు పాత్రను చక్కగా చేశారు. వారి సహజ నటన మరియు తెలంగాణా యాస డైలాగ్ డెలివరీ మొత్తం చిత్రానికి పాజిటివ్ అనే చెప్పాలి. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి నటీనటుల పాత్రల జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది.
ప్రియదర్శి క్లైమాక్స్‌లో తన ఎమోషనల్ యాక్టింగ్‌తో తనని తాను మరోసారి నిరూపించుకున్నాడు. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ ఆన్ స్క్రీన్ క్యూట్‌గా ఉంది మరియు ప్రియదర్శితో ఆమె కెమిస్ట్రీ కూడా బాగా వచ్చింది. సెకండాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో ఆమె నటన ఆకర్షించింది.
మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక గ్రామస్థులు గా నటించిన నటులు కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు.
తీర్పు: దర్శకుడు వేణు ఈ సినిమాని తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కథని రాసుకోవడం జరిగింది. పల్లెటూర్లో జరిగే కథాంశంతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రజలని మెప్పించింది అని చెప్పాలి. కథలో ఉన్న ఎమోషన్స్ అలాగే ప్రేమ తదితర అంశాలను వేణు బాగానే రాసుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఎమోషన్స్ మరియు ఇగో క్లాష్‌లను అన్వేషించడం వెనుక అతని ఉద్దేశం అందరికీ నచ్చుతుంది.
ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ ప్రాంతంలో జరుగుతున్న ఆచారాలు మరియు కార్యక్రమాలను ఎలా ఉంటాయో మనం నిజజీవితంలో చూపించిన విధంగానే ఈ కథలో కూడా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి నటీనటుల పాత్రల జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. అదే విధంగా ఆ పాత్రల మధ్య వచ్చే సున్నితమైన హాస్యం కూడా ఈ సినిమాకు ప్రధాన బలం.
ఫస్ట్ హాఫ్‌లో సన్నివేశాలు మినహాయిస్తే ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని కామెడీ సీన్స్ ను తగ్గించాల్సింది. అలాగే ఈ సినిమాకి స్టార్ కాస్ట్ కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి చిన్న నటీనటులు కావడంతో ప్రేక్షకులను కూడా అంతగా ఆసక్తి చూపించే విధంగా ఉండదు. కాకపోతే ఒక్కసారి సినిమా చూసిన తర్వాత ఆ అభిప్రాయాన్ని ప్రేక్షకులు మార్చుకుంటారు.
సారాంశంగా చెప్పాలంటే, బలగం అనేది భావోద్వేగాలతో కూడిన పల్లెటూరి కుటుంబ కథ, ఇందులో సిట్యుయేషనల్ కామెడీ మరియు నటీనటుల అద్భుతమైన ప్రదర్శనలు ఉంటాయి. అలాగే వారి జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. అయితే, స్లో నేరేషన్, పూర్తిస్థాయిలో కమర్షియల్ అంశాలు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. చక్కగా ప్రమోట్ చేస్తే, ఈ వారాంతంలో సినిమా టిక్కెట్ విండోల వద్ద మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.