Akhanda: చరిత్రాత్మక ప్రదేశాల్లో ‘షూటింగ్

0
99
Balakrishna 'Akhanda' to be shot at historical places

Akhanda Shoot: హై-వోల్టేజ్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండా’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రగ్యా జైస్వాల్‌ నాయిక. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ జులై నుంచి పునః ప్రారంభం కానుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని గండికోట, కడప, చిత్తూరుకి సంబంధించిన చరిత్రాత్మక ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనుంది. బాలకృష్ణతోపాటు ఇతర ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి. శ్రీకాంత్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 ప్రస్తుతం చిత్ర బృందం లొకేషన్లను పరిశీలిస్తోంది. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్‌లో వస్తుండటంతో ‘అఖండ’పై అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ‘అఖండా’ తరువాత, మైప్రీ మూవీ మేకర్స్ నిర్మించబోయే గోపిచంద్ మలినేని యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం బాలయ్య రెడీ అవుతున్నారు.