అఖండ US ప్రీమియర్ రివ్యూ

Balakrishna Akhanda Review Rating
విడుదల తేదీ : 02 డిసెంబర్ 2021
రేటింగ్ : 3/5
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు‚ అవినాష్, శ్రీకాంత్
దర్శకుడు : బోయపాటి శ్రీను
సంగీతం : S. థమన్
నిర్మాణ సంస్థ : ద్వారకా క్రియేషన్స్
రచన : బోయపాటి శ్రీను, ఎం. రత్నం (డైలాగ్స్)

Akhanda US Premiere Review In Telugu: బోయపాటి శ్రీను అలాగే బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ (Akhanda). బాలకృష్ణ అఖండ మూవీ అన్ని హంగులు పూర్తి చేసుకుని డిసెంబర్ 2న విడుదల అవుతుంది. అఖండ మూవీ  USA ప్రీమియర్స్ సంబంధించిన అప్డేట్స్ సినిమా హిట్ అని తేల్చి చెప్పాయి.

అఖండ (Akhanda) బోయపాటి శ్రీను మాస్ డ్రామా. బాలకృష్ణ (Balakrishna) రెండు పాత్రలనూ చక్కగా డిజైన్ చేసి, వాటికి న్యాయం చేశాడు. డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు అభిమానులను కూడా ఆకట్టుకున్నాయి.

బాలకృష్ణ (Balakrishna) అఘోరా పాత్ర అయితే సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. అఘోరా పాత్రకు సంబంధించి డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ని డైరెక్టర్ బోయపాటి బాగా తీర్చి దిద్దాడు. దానికి తగ్గట్టే బాలకృష్ణ కూడా ఆ పాత్రకి న్యాయం చేశారు.

Akhanda USA Premieres On December 1st and Pre Release Business details
Akhanda USA Premieres On December 1st and Pre Release Business details

శ్రీకాంత్ (Srikanth) విలన్ పాత్రలో మెప్పించాడు అందర్నీ, తన డైలాగ్ డెలివరీ గాని అలాగే ఫైట్స్ కానీ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. శ్రీకాంత్ అలాగే బాలకృష్ణ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటాయి.

అఖండ(Akhanda) సినిమా కొన్ని సన్నివేశాలు సాగదీసిన, బోయపాటి మార్క్ అలాగే హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగింది. రొటీన్ స్టోరీలైన్ మరియు బ్యాక్ టు బ్యాక్ హెవీ డ్యూటీ యాక్షన్ సన్నివేశాలు. దానికి తగ్గట్టు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

Akhanda Review U.S. Live Premiere Updates, Rating
Akhanda Review U.S. Live Premiere Updates, Rating
- Advertisement -

జగపతి బాబు, శ్రీకాంత్ అలాగే ప్రజ్ఞా జైస్వాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మొత్తం మీద సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ అనిచెప్పవచ్చు అలాగే మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా బాగానే ఎక్కుతుంది.  బోయపాటి – బాలకృష్ణ మూడో కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ గా నిలిచింది.

Telugu Review: అఖండ రివ్యూ: బాలయ్యల మాస్ జాతర 

 

Related Articles

Telugu Articles

Movie Articles

మొత్తం మీద సినిమా బాలకృష్ణ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ అనిచెప్పవచ్చు అలాగే మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా బాగానే ఎక్కుతుంది.  బోయపాటి - బాలకృష్ణ మూడో కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ గా నిలిచింది. అఖండ US ప్రీమియర్ రివ్యూ