న‌ట‌సింహ‌ బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను BB3 విడుదల డేట్ ఫిక్స్

0
221
Balakrishna BB3 Release date confirmed

‘సింహా’, ‘లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ హ్యాట్రిక్ మూవీ BB3. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ మూవీ నుండి నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా రిలీజ్ చేసిన BB3 First Roar టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని మే28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. టీజ‌ర్‌లో మాస్‌లుక్‌లో అద‌ర‌గొట్టిన న‌ట‌సింహం ఇప్పుడు స్టైలిష్‌లుక్‌లో ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. జేబులో చేయిపెట్టుకుని న‌డిచివ‌స్తున్న బాల‌య్య స్టైలిష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మే 28 విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న‌ నందమూరి తారక రామారావు జ‌యంతి కావ‌డం విశేషం.

Also Read: జోరు మీదున్న రవితేజ.. ‘ఖిలాడీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ 

చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ – “’సింహా’, ‘లెజెండ్` త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను గార్ల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మ‌రో సూప‌ర్‌ సెన్సేష‌న‌ల్ మూవీ ఇది. మా ద్వార‌కా క్రియేష‌న్స్ బేన‌ర్‌లో అత్యంత ప్రెస్టీజియ‌స్‌గా, భారీ తారాగ‌ణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఫిబ్ర‌వ‌రి సెకండ్ వీక్ నుండి ఫైన‌ల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్త‌వుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే28న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్నాం“ అన్నారు.

Balakrishna BB3 Release date and cast crew along with posters details

నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌తో పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

 

Previous articleList of Telugu movies release dates 2021
Next articleDaksha Nagarkar Latest Stills