Bhagavanth kesari Release date: నందమూరి బాలకృష్ణ వరుస భారీ విజయాలతో ముందుకు సాగుతున్నారు. ఈ విజయాలను కొనసాగిస్తూ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గర నుండి అటు ఫ్యాన్స్ లోనూ అలాగే మూవీ లవర్స్ లో అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే టీజర్ విడుదలైన మరింత అంచనాలు పెరిగాయి. ఈరోజు మేకర్స్ భగవంత్ కేసరి విడుదల తేదీని ప్రకటించడం జరిగింది.
Bhagavanth kesari Release date: మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లుగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రిలీజ్ డేట్ కి సంబంధించిన బాలకృష్ణ యాక్షన్ అవతార్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలకృష్ణ నడిచే వాల్కనో లా వున్నారు. అయితే ఇక్కడ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ డేట్ ప్లానింగ్ మామూలుగా లేదు. భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రిలీజ్, లాంగ్ దసరా హాలీడేస్ సినిమాకు బిగ్ అడ్వాంటేజ్.
ఇక రాంగ్ వీకెండ్ అలాగే హాలిడేస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ సినిమా సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి రోజు కనుక పాజిటివ్ టాక్ వస్తే ఇక బాక్సాఫీసు బద్దలు అని చెప్పవచ్చు. భగవంత్ కేసరిలో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ డేట్ ని ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా డిజైన్ చేస్తున్నట్టు మూవీ వర్గాల నుండి సమాచారం అయితే తెలుస్తుంది.