Bhagavanth Kesari Shooting Pics Leaked: నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ భగవంత్ కేసరి. భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ లో బాలయ్య తన ఏజ్ కు తగినట్లు
Bhagavanth Kesari Shooting Pics Leaked: వయస్సు మళ్ళిన హీరోగా కనిపించనున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ కు జోడిగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది. ఈ మూవీలో బాలకృష్ణ డాక్టర్ క్యారెక్టర్ లో శ్రీలీల నటిస్తోంది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులలో చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెంచింది. టీజర్ ను బట్టి ఈ మూవీ లో బాలయ్య లుక్స్ మరియు డైలాగ్స్ ఎంతో డిఫరెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు ఈ మూవీ లో అనిల్ రావిపూడి ఫన్ యాంగిల్ కూడా మిక్స్ అయి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ అర్ధం అవుతుంది. అయితే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఒక ఫోటో లీక్ అయ్యింది. సదరు ఫోటో వైరల్ అవ్వడంతో పాటు ప్రస్తుతం నెట్ లో హల్చల్ చేస్తోంది.
రీసెంట్ గా జరుగుతున్న షూటింగ్ కి సంబంధించి బాలయ్య బైక్ చేజింగ్ మోడ్ లో ఉన్న ఫోటో కావడంతో ఫ్యాన్స్ ఈ ఫోటో ను ట్విట్టర్ లో విపరీతంగా షేర్ చేసి బాగా పాపులర్ చేస్తున్నారు. బాలయ్య మాస్ లుక్ తో బుల్లెట్ బండిపై రైడ్ చేసుకొని వస్తూ ఉంటే …దబిడి దిబిడే…అట్లుంటది బాలయ్య తో అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీ కి మ్యూజిక్ అందిస్తోన్నది తమన్ కాబట్టి సాంగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి అనేది కన్ఫర్మ్.ఈ మూవీ వీలైనంత త్వరగా పూర్తి చేసి బాబి డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. త్వరలో మొదలు కాబోయే ఆంధ్ర ఎన్నికల లోపు రెండు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేయాలని బాలయ్య ప్రయత్నం. ఇంకా ఎన్నికలకు కాస్త వ్యవధి ఉండడంతో షూటింగ్ లకి ఎలాంటి సమస్య రాకూడదు అని ఓవైపు సినిమాలు చేస్తూనే బాలకృష్ణ మరోవైపు రాజకీయ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.