Balakrishna – Boyapati (BB4): బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ సినిమా అయిన అఖండ (Akhanda) రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద సంచలనం క్రియేట్ చేస్తుంది. ఎవరు ఊహించని విధంగా మాస్ యాక్షన్ డ్రామా తో బోయపాటి శ్రీను ఈ సినిమాని తెరకెక్కించారు. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి బిబి3 మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి.
కరోనా కారణంగా రెండు ఏళ్ళు ఈ సినిమా బిబి3 షూటింగ్ లేట్ అయింది. మొత్తం మీద అ అనుకున్నట్టు ఎవరు పోటీ లేకుండా ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అఖండ (Akhanda) సినిమాలో బాలకృష్ణ (Balakrishna)ని హై వోల్టేజ్ పాత్రలో చూడటంతో ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు.
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసింది. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నట్టు సమాచారం అందుతుంది. క్రేజీ సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు బాలకృష్ణ (Balakrishna) తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
Also Read: టైమ్ లూప్ కాన్సెప్ట్ సినిమా రైట్స్ తీసుకున్న అల్లు అరవింద్..!
ఇప్పుడు బాలకృష్ణ(Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. బోయపాటితో సినిమా అంటే బాలకృష్ణ రెడీ అంటారు. అలాగే బోయపాటి కూడా బాలకృష్ణ సినిమా తీయాలంటే చాలా ఇష్టంగా వర్క్ చేస్తాడు. అందుకని వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయింది.

ప్రస్తుతం అఖండ విజయాన్ని తీవ్ర పంచుకుంటున్న బాలకృష్ణ, తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని తో చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో నాలుగైదు నెలల్లో సినిమా పూర్తి అవుతుంది. దీని తరవాత వీరిద్దరి కాంబినేషన్ ఉండొచ్చు అని అంటున్నారు.