వైరల్ అవుతోన్న బాలయ్య డ్యాన్స్ వీడియో..!

Balakrishna funny Dance Video went viral on social media
Balakrishna funny Dance Video went viral on social media

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. ఈ మధ్యే ‘రూలర్’ చిత్రానికి సంబందించిన టీజర్ ను కూడా విడుదల చేశారు.

బాలయ్య పబ్లిక్ కార్యక్రమాలలో ఎప్పుడూ చురుకుగా పాల్గొంటుంటారు అనే సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని పాటలకు భాష అవసరం లేదు. ఇదిలా ఉండగా. పాట నచ్చితే ఏ భాష అనేది పట్టించుకోకుండా కాలు కదిపెస్తారు కుర్రకారు. అలాంటి సాంగ్స్ లో ‘ఆలుమా డోలుమా’ ఒకటి. తమిళ్ లో అజిత్ నటించిన ‘వేదాలం’ సినిమాలోని ఈ పాట పబ్ లో ఈవెంట్స్ లో ఎక్కువగా ప్లే చేస్తుంటారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఈ పాటకు తనదైన ఎనర్జీ స్టెప్స్ వేసి అందరినీ ఎట్రాక్ట్ చేసాడు. ‘రూలర్’ సాంగ్ షూటింగ్ గ్యాప్ లో పబ్ లో బాలయ్య అజిత్ సాంగ్ కి ఎంతో ఎనర్జీగా డాన్సులేసాడు.

తాజాగా బాలయ్య ఓ పబ్లిక్ ఈవెంట్ లో డ్యాన్స్ తో ఇరక్కొట్టేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ మాస్ బీట్ సాంగ్ కి స్టెప్స్ వేసి అక్కడి జనాలతో క్లాప్స్ కొట్టించుకున్నారు. ఈ స్టెప్స్ కు చుట్టూ ఉన్న.. జనాలు ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేశారు. అభిమానులతో పాటు మిగతా వారు కూడా అరవై చేరువలో ఇరవై ఏళ్ల కుర్రాడిలా బాలయ్య డాన్సులు ఇరగదీస్తున్నాడే అంటూ ఆశ్చర్య పోతున్నారు.