Homeసినిమా వార్తలుటాప్ హీరోతో వేణు ఎల్దండి నెక్స్ట్ మూవీ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

టాప్ హీరోతో వేణు ఎల్దండి నెక్స్ట్ మూవీ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

Venu Yeldandi next movie with Nandamuri Balakrishna, NBK new movie with Balagam director Venu Yeldandi, Balakrishna NBK108 shooting update, Balakrishna. Balakrishna green single to Balagam director Venu Yeldandi

జబర్దస్త్ కామెడీ షో తో పాటు సినిమాలో కూడా మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమెడియన్ వేణు (Venu Yeldandi). అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన బలగం చిత్రంతో వేణు లోని సరికొత్త యాంగిల్ ప్రజలకు పరిచయమైంది. కమెడియన్గా కడుపుబ్బ నవ్వించడమే కాదు మెగా ఫోన్ పట్టుకొని బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించడం కూడా తెలుసు అని వేణు ఎల్దండి ప్రూవ్ చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో వేణు పేరు మారుమోపుతోంది..

కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించిన బలగం చిత్రం అవార్డుల పరంగా కూడా తన సత్తాను చాటుకుంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ ను ఈ చిత్రం తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు దిల్ రాజ్ వారసులైన హర్షిత్ మరియు హన్షిత‌లు నిర్వహించారు. ఈ చిత్రం తర్వాత వేణు దిల్ రాజ్ ప్రొడక్షన్స్ లో మరో సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజ్ ఇప్పటికే కన్ఫామ్ చేశారు కూడా.

ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించి మరో సరికొత్త వార్త నెట్ లో వైరల్ అయింది. ఈసారి వేణు (Venu Yeldandi) సినిమా ఫిక్స్ అయింది ఓ స్టార్ హీరోతో అది కూడా నందమూరి అందగాడు బాలకృష్ణతో (Balakrishna) అని బలంగా టాక్ వినిపిస్తోంది. బాలయ్యకు సినిమా కంటెంట్ బాగుంటే చాలు…డైరెక్టర్ కొత్త పాత అన్న తేడా లేదు. పైగా డైరెక్టర్ని పెద్దగా ఇబ్బంది పెట్టే మనిషి కాదు…తనకు ఏది చెప్తే అది తన లెవెల్ లో చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే బాలయ్య (Balakrishna) డైరెక్టర్లకి ఆల్ టైం ఫేవరెట్.

Balakrishna green single to Balagam director Venu Yeldandi

ఎప్పటినుంచో దిల్ రాజుకు బాలకృష్ణతో (Balakrishna) మూవీ చేయాలని ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజ్ వేణు (Venu Yeldandi) తో కథ చెప్పించడం.. అది నచ్చి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అన్న వార్త సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న NBK108 చిత్రంలో బిజీగా ఉన్న బాలయ్య.. దాని తర్వాత బోయపాటి శ్రీను తో కూడా మరో చిత్రం చేయబోతున్నారు. ఈ గ్యాప్ లో వేణు తో సినిమా పూర్తి చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మరి ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప పూర్తి క్లారిటీ రాదు. నిజంగా బాలయ్య బాబు వేణుతో మూవీకి సై అంటే మాత్రం ఇంకా వేణు దశ తిరిగిందని అర్థం…

Web Title: Venu Yeldandi next movie with Nandamuri Balakrishna, NBK new movie with Balagam director Venu Yeldandi, Balakrishna NBK108 shooting update, Balakrishna.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY