ఏపీ టిక్కెట్ల వివాదంపై బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

Balakrishna, AP Tickets Issue: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు ఇంకా. టాలీవుడ్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా బయటికి వచ్చి వాళ్ల అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. రీసెంట్ గా రాంగోపాల్ వర్మ మంత్రి గారిని కలిసిన విషయం తెలిసిందే. చాలారోజుల నుంచి టికెట్ల (AP Ticket Issue) వ్యవహారం దుమారం రేపుతున్నా.. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న బాలకృష్ణ (Balakrishna).. అఖండ సక్సెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

అఖండ సక్సెస్ మీట్ ఏర్పాటుచేసిన సంక్రాంతి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) గారు సినిమా గురించి అలాగే తాజాగా చోటు చేసుకున్నటువంటి వివాదాల గురించి అఖండ వేదికపై మాట్లాడారు. ఇండస్ట్రీపై లక్షలాది మంది ఆధారపడుతున్నారని.. వారి అందిరికీ ఉపాధి లభించాలి అన్నారు..

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పై ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా పోరాడాలి అని పిలుపు ఇచ్చారు.. రెండు తెలుగు ప్రభుత్వాలు సినిమా రంగానికి సహకరించాలని కోరారు.. సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటాను అన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టు చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలు ఉండవు అన్నారు.

Balakrishna key comments on movie tickets issue
Balakrishna key comments on movie tickets issue

అందరం కలిసి చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిద్దామని అన్నారు. ఏ ఒక్కరి అభిప్రాయం సరికాదని, అందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దామని అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు. అభిమానుల సంఘాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఇతర నిపుణుల అభిప్రాయాలు సేకరించింది. త్వరలోనే టికెట్ల ధరలపై నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది.

Related Articles

Telugu Articles

Movie Articles