Balakrishna make conditions for Boyapati Srinu Movie
Balakrishna make conditions for Boyapati Srinu Movie

బాలకృష్ణ (Balakrishna) 106 వ సినిమాని బోయపాటి డైరెక్షన్లో చేయబోతున్నట్టు ప్రకటించగానే ఫ్యాన్స్ కు అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో భయాలు కూడా అదే రేంజ్లో ఏర్పడ్డాయి. ఇక ‘వినయ విధేయ రామా’ సినిమాలో కూడా లాజిక్ లెస్ హీరోయిజాన్ని చూపించిన బోయపాటి పెద్ద డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. హీరో బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి. ఇక వీరి కాంబినేషన్ హ్యాట్రిక్‌కి సిద్ధమవుతుంది. త్వరలోనే వీరి కాంబోలో వచ్చే మూడో సినిమా షూటింగ్ మొదలు కానుంది.

అయితే ఇటీవల బాలయ్య చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలు డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీరి కాంబినేషన్‌పై ఇప్పుడు నెగటివ్ ఎక్కువగా ఉంది. దీంతో ఈ విషయం గమనించిన బాలయ్య ..బోయపాటి కొన్ని కండీషన్స్ పెట్టారట. ‘యాక్షన్ సీన్లు హద్దులు దాటకుండా చూసుకోండి. కొంచెం స్టైల్ మార్చండి. మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వచ్చేలా కథాకథనాల్లో కొత్తదనం ఉండేలా చూసుకోండి.’ అని బాలయ్య బోయపాటికి చెప్పాడట. ముఖ్యంగా సినిమా మొత్తం ఇరవై కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలని చెప్పారట. అలాగే తామిద్దరం రెమ్యునేషన్స్ ఇప్పుడు తీసుకోకుండా రిలీజ్ తర్వాత షేర్ క్రింద తీసుకుందామని ప్రపోజల్ పెట్టారట. బాలయ్య చెప్పిన మాటల్ని దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడని తాజా సమాచారం.