balakrishna mythological epic narthanasala fisrt look released

Narthanasala First Look: Balakrishna:  నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ళ క్రితం ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగిపోయిన ‘నర్తనశాల’ సినిమాను ఇన్నేళ్లకు ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుంచనుండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. తర్వాత హీరోయిన్ సౌదర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’ అర్థాంతరంగా ఆగిపోయింది.

అయితే షూట్ చేయబడిన 17 నిమిషాల గల సన్నివేశాలను విజయదశమి సందర్భంగా అక్టోబర్ 24న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఓ పౌరాణిక సినిమాకు దర్శకత్వం వహించాలనే బలమైన కోరికతో అప్పట్లో ఈ నర్తనశాల సినిమాను ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. దీనికోసం ఆయనే స్వయంగా అర్జునుడి వేషం వేసుకొని కెమెరా ముందుకొచ్చారు. ఇందులో బాలయ్య రూపం ఆకర్షణీయంగా ఉండటంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాలయ్య ‘నర్తనశాల’ పౌరాణిక చిత్రాన్ని ఎన్బికె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా ఛైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ”ఎన్బీకే థియేటర్ లో ‘నర్తనశాల’ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. శ్రేయాస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఎన్బీకే థియేటర్ లో సినిమా చూడవచ్చు. టికెట్ ధర మినిమమ్ రూ. 50 పెట్టాలనుకుంటున్నాం. టిక్కెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలకృష్ణ బసవతారకం ట్రస్ట్ కు ఇస్తామన్నారు” అని చెప్పారు.