హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన బాలకృష్ణ

394
balakrishna-nandamuri-buy-a-new-property-in-hyderabad-jublee-hills
balakrishna-nandamuri-buy-a-new-property-in-hyderabad-jublee-hills

నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటినికి కొనుగోలు చేసారు. రూ. 15 కోట్ల విలువైన ఇంటిని హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ ఏరియాలో కొనుగోలు చేసినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా బాలయ్య. సినీ రంగంలోని వచ్చే డబ్బులను రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతున్నారు.

 

 

ఇప్పటికే ఏపిలోని విజయవాడ, విశాఖ పట్నం, అమరావతితో పాటు అనంతపూర్‌లో పలు ప్రాపర్టీలను బాలయ్య కొనుగోలు చేసాడు. ఏపీలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన బాలకృష్ణ..ఇపుడు హైదరాబాద్‌లో కూడా వరుస ప్రాపర్టీలు కొనుగోలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసి .. మంచి రేటు రాగానే అమ్మేస్తున్నారు. ఈ రకంగా సినిమాల్లోనే కాక.. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచిగానే ఆదాయం సంపాదిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ భవంతిని ఫిబ్రవరి 11న కొనుగోలు చేసారు.

 

 

ఈ ప్రాపర్టీని నందమూరి బాలకృష్ణ.. నడింపల్లి సత్య శ్రావణి నుంచి కొనుగోలు చేసినట్టు Zapkey.com అనే వెబ్ సైట్ చెబుతోంది. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో రెండు అంతస్తులు కలిగిన ఈ భవంతిని 9395 చదరుపు అడుగులు ఉందట. ఈ ప్రాపర్టీని బాలయ్య, వసుంధరా దేవి దంపతులు జంటగా కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను బట్టి తెలుస్తోంది.  ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘బీబీ 3’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

 

 

ఈ చిత్రాన్ని మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  మరోవైపు బాలకృష్ణ  తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌తో పాటు ఫ్యాక్షనిస్టుగా మరోసారి రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.