Balakrishna NBK 109 Shooting Update: బాలకృష్ణ వరుసగా యాక్షన్ సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. దాని తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొల్లి బాబీ దర్శకత్వంలో తన 109 సినిమాని అనౌన్స్ చేయటం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ గురించి లేటెస్ట్ గా ఒక అప్డేట్ తెలుస్తుంది.
Balakrishna NBK 109 Shooting Update: చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హిట్ సాధించిన దర్శకుడు బాబి ఇప్పుడు బాలకృష్ణ సినిమాని యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా NBK109 సినిమాని రెడీ చేస్తున్నారు. భగవంత్ కేసరి సినిమా పూర్తి కాగానే బాబీ సినిమా షూటింగ్ ప్రారంభం చేస్తారా అని అందరూ అనుకుంటున్నారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం బాబి NBK109 షూటింగ్ సంబంధించిన కార్యక్రమాల్ని మొదలుపెట్టడం జరిగింది.
సినిమా వర్గాల వారి నుండి అందుతున్న సమాచారం మేరకు, బాలకృష్ణ అలాగే బాబి సినిమా మొదటి షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగు స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూటింగ్ చేయటానికి దర్శకుడు బాబి ప్లాన్ చేశారంటూ.. దానికి సంబంధించిన సెట్ వర్క్ కూడా ఫిలిం సిటీ లో ప్రస్తుతం జరుగుతుంది.

మరో రెండు వారాల్లో ఈ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన సెట్ వర్క్ పూర్తి అవుతుందని.. వెంటనే బాలకృష్ణ అలాగే బాబి మొదటి షెడ్యూల్ ని ప్రారంభిస్తారు అంటూ సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాలో కూడా బాలకృష్ణ డబల్ రోజుల్లో కనపడబోతున్నారు. తండ్రి కొడుకుల పాత్రలో బాలయ్య బాబు నటించనున్నాడని.. అయితే బాబి తండ్రి పాత్రకు మాస్ ఎలిమెంట్స్ అలాగే లుక్కు పరంగా చాలా కేర్ తీసుకున్నట్టు.. బాలయ్య గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందని ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.