తన రెండో వైపు చూపించిన బాలయ్య

బాలయ్య…పవర్ ఫుల్ సినిమాలకు,మాస్ డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన బాలయ్య ఇప్పుడు KS రవికుమార్ డైరెక్షన్ లో తన తదుపరి సినిమా మొదలుపెట్టాడు.థాయిలాండ్ లో ఈ సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.అయితే ఈ సినిమాకి సంబంధించి బయటికి వచ్చిన బాలయ్య లుక్ మాత్రం అందరికి షాక్ ఇస్తుంది.100 కి పైగా సినిమాలు చేసిన బాలయ్య అంత స్టైలిష్ గా ఎప్పుడూ కనిపించలేదు.వయసు కూడా బాగా తగ్గిపోయినట్టు ఉంది ఆ లుక్ లో.ఇది ఖచ్చితంగా సెకండ్ షేడ్ ఆఫ్ బాలయ్య అని చెప్పుకోవాలి,ఒప్పుకోవాలి.

ఈ సినిమా కి సంబందించిన ఎక్కువ భాగం షూటింగ్ థాయిలాండ్ లోనే జరగబోతుంది.సోనాల్ చౌహాన్,వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి డిసెంబర్ లో సినిమా రిలీజ్ చెయ్యాలి అనేది ప్లాన్.ఒక వేళ బన్నీ సినిమా ‘అల వైకుంఠపురము’లో లేట్ అయితే ఈ సినిమాని 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలి అనే ప్లాన్ కూడా ఉంది.సో,ఇంత స్టైలిష్ లుక్ తోనే షాక్ ఇచ్చిన బాలయ్య సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడు అనేది వేచి చూడాలి.