Balakrishna NBK107 Title: అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ కి జంటగా శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. NBK107 షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఇప్పుడు NBK107 సినిమా టైటిల్ గురించి న్యూస్ వైరల్ గా మారింది.
బాలకృష్ణ NBK107 title పోస్టర్ ని దసరాకి విడుదల చేస్తారని అందరూ భావించారు అలాగే ఎదురు చూడటం జరిగింది. కానీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఇప్పుడు NBK107 title నీ ఈ వారంలో కానీ లేదంటే వచ్చే వారంలో విడుదల చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ముందుగా బాలకృష్ణ NBK107 సినిమాకి జై బాలయ్య & రెడ్డి గారు టైటిల్ ప్రచారంలోకి వచ్చాయి. జై బాలయ్య అభిమానుల సందడి మరియు ఇటీవల అఖండలో, అదే సాహిత్యంతో సాగే పాట సూపర్ హిట్ అయ్యింది. అదే సమయంలో, “అన్న గారు” అనేది లెజెండరీ ఎన్‌టి రామారావుకు ప్రత్యక్ష సూచన. ఈ రెండు టైటిల్స్‌ను బాలకృష్ణ రిజెక్ట్ చేయడం జరిగిందట.
“అన్న గారు” అని పిలుచుకుంటూ “జై బాలయ్య”ని వాడడం వల్ల తనని తాను పొగుడుకునే రకంగా ఉంటుందని బాలయ్య భావించి ఉండవచ్చని ఫిలిం సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఇద్దరి నుండి టైటిల్ కోసం బాలయ్యను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని, ఈ రెండింటినీ అంగీకరించబోనని బాలయ్య ఇప్పటికే స్పష్టం చేశారు అని గుసగుసలు వినపడుతున్నాయి.
అయితే వీటితో పాటు బాలకృష్ణ NBK107 సినిమా కి టైటిల్ కూడా ప్రచారంలో నడుస్తుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ కేరెక్టర్ పేరు వీరసింహారెడ్డి అని, టైటిల్ కూడా రెడ్డి సెంటిమెంట్ తో వీరసింహారెడ్డి టైటిల్ నే ఫిక్స్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి కొన్ని రోజులు పోతే గాని దీనిపై మిస్టరీ వీడదు..