Balakrisha – Koratala Siva Movie: కొన్ని నెలల క్రితం బాలకృష్ణ కొరటాల శివ మల్టీస్టారర్ మూవీ ఉంది అంటూ ప్రచారం జరిగింది సినీ సర్కిల్ లో. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు సినీ సర్కిల్ నుంచి కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
అలాగే కొరటాల శివ ఎన్టీఆర్ తో NTR30 సినిమా షూటింగ్ ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. దీని తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి తో 108 సినిమా అనౌన్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ తెరపైకి బాలకృష్ణ కొరటాల శివ మల్టీస్టారర్ మూవీ (Balakrisha multi Starrer Movie) అప్డేట్ ఒకటి వచ్చింది.
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలు తీయటంలో ఒక్కో డైరెక్టర్ కి ఒక స్టైల్ ఉంది. అలాగే కొరటాల శివ మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీయటంలో ముందు ఉంటారు. ఇక బాలకృష్ణ (Balakrishna) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలకృష్ణ మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు.
ఇప్పుడు వీళ్లిద్దరు కాంబినేషన్లో NBK109 సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సినీ సర్కిల్ లో గుసగుసలు వినపడుతున్నాయి. దీనితో పాటు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో రెండో హీరోగా మహేష్ బాబు పేరు గట్టిగా వినబడుతుంది.
ఒకవేళ ఆయన కాదంటే, మెగా క్యాంపు నుంచి కథానాయకుడిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు బాలయ్య గీతా ఆర్ట్స్ వారి ఆహా ఓటిటిలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో కోసం అగ్రిమెంట్ సమయంలోనే బాలయ్య.. అల్లు అరవింద్ తో ఓ సినిమా చేయాలనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బాలకృష్ణ కొరటాల శివ మల్టీస్టారర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.