Balayya and Ravi Teja: అఖండ వీరసింహారెడ్డి లాంటి చిత్రాలు ఇచ్చిన కిక్ తో నందమూరి నటసింహం వరుస పిక్చర్లతో బాగా బిజీగా ఉంది. మరోపక్క రావణాసుర ఇచ్చిన ఫ్లాప్ నుంచి బయటపడడానికి రవితేజ మాస్ బీభత్సానికి సిద్ధమవుతున్నాడు. బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీ NBK108 ని అనిల్ రావిపూడి తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి పాజిటివ్ భజ్ నెలకొనడమే కాకుండా మూవీ పక్కా హిట్ అని ప్రచారం జరుగుతుంది.
Balayya and Ravi Teja: మరోపక్క రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) బయోపిక్ చిత్రంపై కూడా బజ్ పాజిటివ్ గానే ఉంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ప్రోమో చిత్రంపై ఆసక్తిని పెంచాయి. ఇండియన్ రాబిన్ గుడ్ గా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అయిన ఈ చిత్రం సౌత్ ఇండియా క్రైమ్ క్యాపిటల్ అయిన స్టువర్టుపురం నేపథ్యంలో సాగుతుంది.
ఇప్పటివరకు ఈ ఇద్దరి సినిమాలు మూడుసార్లు తలపడ్డాయి అయితే ఇప్పుడు మరోసారి తలపడడానికి ఈ ఇద్దరు తమ సరికొత్త చిత్రాలతో సిద్ధంగా ఉన్నారు.2008లో బాలకృష్ణ (Balakrishna) ఒక్క మగాడు చిత్రంతో రవితేజ (Ravi Teja) కృష్ణ మూవీ పోటీ పడింది.. ఒక్కమగాడు బాలకృష్ణకు డిజాస్టర్ మిగల్చగా కృష్ణ మాత్రం రవితేజ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.



తిరిగి 2009లో బాలకృష్ణ మిత్రుడు మూవీ రవితేజ కిక్ మూవీ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అయితే ఈసారి కూడా రవితేజ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ముచ్చటగా మూడోసారి ఇద్దరు 2011 సంక్రాంతి కి పోటీకి దిగారు.. మిరపకాయ తో రవితేజ రాగా పరమవీరచక్ర మూవీతో బాలకృష్ణ బరిలోకి దిగాడు. పరమవీరచక్ర పరమ ఫ్లాప్ అవ్వగా మిరపకాయ మాత్రం మంచి హిట్ అయింది. తిరిగి మళ్లీ దసరాకు వీరిద్దరి చిత్రాలు ఒకేసారి బరిలోకి దిగుతున్నాయి. మరి ఈసారి గెలుపు టైగర్ నాగేశ్వరరావు ద లేక ఎన్బికె 108 దా చూడాలి.
Web Title: Balakrishna Beat Ravi Teja This Time at Dussehra box office details, Balakrishna NBK108 and Ravi Teja Tiger Nageswara Rao clash at box office, Tiger Nageswara Rao Release Date, NBK108 Release date, Dussehra 2023 movies, Ravi Teja new movie, Balakrishna new movie