‘అఖండ’ ఫైనల్ షెడ్యూల్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ..!

Balakrishna Akhanda: నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ”అఖండ”. వీరి కలయికలో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవడంతో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ Akhanda టీజర్ కి 50 మిలియన్ల వ్యూస్ రావడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

‘అఖండ’ సినిమా చివరి దశకు వచ్చేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈరోజు హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయిందని.. దీంతో సినిమా మొత్తం పూర్తవుతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ వర్కింగ్ స్టిల్ ని రిలీజ్ చేశారు. ఇందులో అఘోరా గెటప్ లో ఉన్న బాలకృష్ణ తో బోయపాటి శ్రీను సీన్ గురించి వివరిస్తూ కనిపిస్తున్నారు. అలాగే Akhanda సినిమా‌ రిలీజ్ పై లేటెస్ట్ గా ఒక అప్ డేట్ తెలిసింది.

దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు అయితే మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు గాని, అక్టోబర్ లో సినిమా రిలీజ్ అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles