(Balakrishna Ruler Movie Day 2 Box office collection report) నందమూరి నటసింహం బాలకృష్ణ కు అస్సలు కలిసి రాలేదు. ఒకటి కాదు రెండు కాదు మూడు భారీ డిజాస్టర్లు ఆయన కెరీర్ ను ప్రభావితం చేశాయి. ఇంతకుముందు బాలయ్య తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనుకున్న నిర్మాతలు ఇప్పుడు ఆయన సంప్రదించే సాహసం చేయలేకపోతున్నారు. ఇక ఈఏడాది సంక్రాంతికి బాలకృష్ణ , ఎన్టీఆర్ కథానాయకుడు తో ప్రేక్షకులముందుకు వచ్చాడు. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా వస్తున్న మొదటి భాగం కావడంతో సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని రీతిలో జరిగింది. అయితే మొదటి షో నుండే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడం తో బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.
రూలర్ ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. సీ కళ్యాణ్ సినిమాని నిర్మించగా, చిరంతన్ భట్ సంగీతమందించాడు. ఈ చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టుకున్న రెండవ రోజు మాత్రం బాడ్ టాక్ వలన పెద్దగా ఆ ఓపెనింగ్స్ స్థాయి కలెక్షన్స్ ని సెకండ్ డే కంటిన్యూ చేయలేకపోయింది. ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన రూలర్ సినిమా మొదటి రోజు 4.40 కోట్ల షేర్ తో సూపర్బ్ అనిపించుకుంటే, రెండవ రోజు కేవలం కోటి రూపాయల షేర్ మాత్రమే సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడిపోయింది.
నైజాం | 1.01 cr |
సీడెడ్ | 1.38 cr |
ఉత్తరాంధ్ర | 44 Lk |
ఈస్ట్ | 35 Lk |
వెస్ట్ | 30 Lk |
కృష్ణా | 26 Lk |
గుంటూరు | 1.42 cr |
నెల్లూరు | 27 LK |
వరల్డ్ వైడ్ టోటల్ | 5.43 cr (share) |