Balakrishna son nandamuri mokshagna photo viral on social media.
Balakrishna son nandamuri mokshagna photo viral on social media.

నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ కు ఎప్పుడు పరిచయం అవుతాడా అని అభిమానులు అంతా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు మోక్షజ్ఞ సినిమా రాబోతోందని బాలకృష్ణనే స్వయంగా చెప్పారు. అద్భుతమైన కథ కోసం ఎదురుచూస్తూ ఉన్నామని.. సినిమాల్లోకి రావడం పక్కా అని కూడా చెప్పారు. కానీ ఎందుకో ఆలస్యం అవుతూనే ఉంది. ముఖ్యంగా మోక్షజ్ఞ కు సినిమాలంటేనే ఇష్టం లేదన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అవి బాలయ్య అభిమానులను ఎంతగానో బాధపెట్టాయి. తాజాగా మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఓ అభిమాని ఈ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. బాల‌య్య రూల‌ర్ లుక్‌లోనే క‌నిపిస్తుండ‌గా, ఆయ‌న కూతురు తేజ‌స్విని, అల్లుడు భ‌ర‌త్‌, భార్య వ‌సుంధ‌ర ఉన్నారు. ముఖ్యంగా మోక్షజ్ఞను అందరూ గమనిస్తూ ఉన్నారు. మోక్ష‌జ్ఞ లుక్‌ చూస్తుంటే.. టాలీవుడ్ ఎంట్రీకి ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ గా వస్తున్నారు. ఇప్పటికే టీజర్ కు మాంచి రెస్పాన్స్ వస్తోంది. అతి త్వరలో సినిమా విడుదల కానుండగా.. ఇక ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది చిత్ర యూనిట్. చిరంతన్ భట్ స్వరపరిచిన ‘అడుగడుగో యాక్షన్ హీరో’ అనే ఫస్టు లిరికల్ వీడియో సాంగును ఆదివారం ఉదయం 11:42 నిమిషాలకి విడుదల చేయనున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటించారు.