Homeసినిమా వార్తలు2026 వ‌ర‌కూ హౌస్ ఫుల్: సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య ఫుల్ స్వింగ్.

2026 వ‌ర‌కూ హౌస్ ఫుల్: సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య ఫుల్ స్వింగ్.

Balakrishna upcoming movie news, 2024 balakrishna movies, NBK109 movie details, NBK109 movie budget, Balakrishna Next movie director, Balakrishna new movie name

Balakrishna upcoming movie news, 2024 balakrishna movies, NBK109 movie details, NBK109 movie budget, Balakrishna Next movie director, Balakrishna new movie name

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ సీనియర్ హీరోల్లో టాప్ లో ఉన్నారు. అఖండ..వీర సింహారెడ్డి అలాగే భగవంత్ కేసరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారంటీ హీరోగా బాలయ్య బాబు ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరు అయ్యారు. సీనియర్ దర్శకులు అలాగే యంగ్ డైరెక్టర్లు కూడా బాలయ్య బాబు డేట్స్ కోసమని ఎదురుచూస్తున్నారు ఇప్పుడు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు బాలయ్య బాబు 2026 వరకు హౌస్ ఫుల్ అని తెలుస్తుంది.

ఇక వివరాల్లోకి వెళితే, భగవాన్ కేసరి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో బాలయ్య బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టటం జరిగింది. 100 కోట్ల మినిమం గ్యారెంటీ అంటూ ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరూపించడంతో సీనియర్ డైరెక్టర్లు అందరూ బాలయ్య బాబు తో సినిమా చేయటానికి క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం బాలయ్య బాబు చేతులు.. దర్శకుడు బాబి తో ఓ సినిమా ప్రారంభ‌మ‌వుతుంది.

NBK 109 టైటిల్ తో వస్తున్న ఈ సినిమాని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ సినిమాని గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తీస్తున్నట్టు సమాచారం. వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ హిట్టు తర్వాత బాబి చేస్తున్న ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ కి భారీగా అంచనాలు ఉన్నాయి.

దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు ఒక సినిమాని నిర్మించబోతున్నారు, ఈ సినిమాకు సంబంధించిన షూటింగు అలాగే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఏడాది సంక్రాంతి రోజున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.. ఇక దీని తర్వాత అఖండ..వీర సింహారెడ్డి అలాగే భగవంత్ కేసరి సినిమాల హిట్ దర్శకులు ముగ్గురు మళ్ళీ లైన్లో ఉన్నారు. దీనిని బట్టి చూస్తే 2026 వరకు ఈ దర్శకులకు తప్పించి మరో దర్శకుడికి డేట్ ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తుంది.

100 కోట్ల మార్కెట్ ఉన్న బాలయ్య బాబుతో సినిమా చేయాలంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభాలు నిర్మాతలు పొందినట్టే అందుకనే బాలయ్య బాబుతో సినిమా చేయడానికి దర్శకులతో పాటు నిర్మాతలు కూడా ఎదురుచూస్తున్నారు. దీనితోపాటు బాలయ్య బాబు కూడా ఎక్కువ రెమెంటేషన్ తీసుకోరు. ప్రతి సినిమాకి ఆయన 20 కోట్ల లోపే తీసుకుంటారు. స‌రైన క‌థ ప‌ట్టుకుని వెళ్తే త‌క్కువ బ‌డ్జెట్ లోనే సినిమా చేసి రిలీజ్ చేయోచ్చు అన్న‌ది చాలా మంది ఆలోచ‌న‌. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలకృష్ణ డేట్లు దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైన ప‌ని.