Balakrishna Upcoming movie Ruler Trailer date locked
Balakrishna Upcoming movie Ruler Trailer date locked

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూలర్’..! టీజర్ ఇప్పటికే మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య బాబు సినిమాకు సంబంధించి ఏదైనా కూడా ముహూర్తంతో కూడినదే.. అందుకే ట్రైలర్ కు కూడా ఆదివారం ఉదయం మంచి ముహూర్తం పెట్టింది ‘రూలర్’ టీమ్. 8వ తేదీన ఉదయం 8.19 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బాలయ్య బాబు కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సినిమాలో బాల‌య్య సరసన వేదిక‌, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భూమికా చావ్లా, జ‌య‌సుధ‌, ప్రకాష్ రాజ్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రూలర్‌ను రిలీజ్ చేయనున్నారు.

ఏ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ నెల 14వ తేదీన వైజాగ్‌లోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

రూలర్ సినిమా రిలీజ్ కు రెఢీ అవ్వగా.. 106వ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు బాలయ్య. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా సినిమా మొదలైంది. బీ గోపాల్ ఫ‌స్ట్ క్లాప్ కొట్ట‌గా, అంబికా కృష్ణ స్విచ్చాన్ చేశారు. నువ్వొక మాటంటే అది శబ్దం.. అదే మాట నేనంటే అది శాసనం అనే డైలాగ్ బాల‌య్య తనదైన స్టైల్ లో డైలాగ్స్ చెప్పారు. ప‌లువురు ప్రముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి.. ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.