బోయపాటి, బాలయ్య మూవీకి ఆసక్తికర టైటిల్!

0
538
Balakrishna BB3 Upcoming Movie Title Torch bearer Fix And Boyapati Srinu Decided

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణతో ( Nandamuri Balakrishna ), మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. అతి త్వరలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు బోయపాటి శ్రీను. ఇంతలో మూవీ టైటిల్ గురించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

ఇటీవలే BB3 పేరుతో ఫస్ట్‌లుక్, ఫస్ట్ రోర్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులను హుషారెత్తించిన మేకర్స్.. ఈ మూవీ కోసం పవర్‌ఫుల్ టైటిల్ పరిశీలనలో పెట్టారట. ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాల టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అందులో డేంజర్ ( Danger ) అనే టైటిల్‌ ప్రముఖంగా వినిపించింది. ఇదిలావుండగా తాజాగా ఈ సినిమాకు మరో టైటిల్ తెరపైకొచ్చింది. నందమూరి అభిమానులకు కిక్కిచ్చేలా ‘డేంజర్’ అనే టైటిల్ ఫైనల్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్‌లో చర్చలు వినిపించాయి. ఆ వెంటనే ‘సూపర్ మ్యాన్’ కూడా లైన్ లోకి వచ్చింది. కానీ తాజా సమాచారం మేరకు ఆ మూడు కాకుండా చిత్రానికి ‘టార్చ్‌బేరర్’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

ఐతే, ఈ టైటిల్‌తో మాస్ ఆడియెన్స్ ఎంతమేరకు కనెక్ట్ అవుతారనే విషయంలోనే కొంత సందిగ్ధంలో ఉన్నట్టుగా టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.