Tiger nageswara rao Vs Bhagavanth kesari Clash: టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మాస్ కి కేరాఫ్ అడ్రస్ గా రవితేజ అలాగే బాలకృష్ణ పేర్లు ఎప్పుడు వినపడతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ నాలుగో సారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యారు. రవితేజ టైగర్ నాగేశ్వర రావు అనే బయోపిక్ సినిమాతో వస్తుండగా బాలకృష్ణ మాత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తో ఈసారి పోటీ పడి ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతో అక్టోబర్ నెలలో విడుదలకు సిద్ధమయ్యాయి.
Tiger nageswara rao Vs Bhagavanth kesari Clash:టైగర్ నాగేశ్వర రావు సినిమా టీజర్ ని రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన టీజర్ లో రవితేజ యాక్షన్ మార్క్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంతేకాకుండా సినిమాపై భారీగానే అంచనాలు పెంచే విధంగా ఈ టీజర్ ని దర్శకుడు కట్ చేయడం జరిగింది. టైగర్ నాగేశ్వర రావు సినిమాని ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 20న విడుదలకు సిద్ధం చేశారు.
ఇక బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస భారీ విజయలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. దర్శకుడు కూడా తను తీసిన వరుస సినిమాలు హిట్ అవటంతో ఈ సినిమాపై కూడా బాలకృష్ణ ఫాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా భగవంత్ కేసరి టీజరు అలాగే పోస్టర్లు దానికి తగ్గట్టుగానే విడుదల చేయడం జరిగింది. భగవంత్ కేసరి సినిమాని అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం చేశారు.
అయితే ఈ ఇద్దరు హీరోలు ఇది మొదటిసారి కాదు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడటం, 2008 లో బాలకృష్ణ ఒక్కమగాడు – రవితేజ, వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమా తో ముందుకు రాగా రవితేజ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అలాగే 2009 లో బాలకృష్ణ మిత్రుడు సినిమాతో రాగా రవితేజ కిక్ సినిమాతో వచ్చి మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు కొట్టడం జరిగింది. అదేవిధంగా 2011 లో పరమవీరచక్ర – మిరపకాయ్ సినిమాలతో ఇద్దరు పోటీ అడగ మళ్లీ రవితేజ నే విన్ అవటం జరిగింది.

ఈ లాజిక్ ప్రకారం ఇప్పుడు 2023 అక్టోబర్ లో విడుదలకు సిద్ధమైన ఈ ఇద్దరు హీరోలు సినిమాల విషయంలో మళ్లీ రవితేజ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాడు అంటూ ఫాన్స్ అలాగే విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈసారి ఈ ఇద్దరితో పోటీ పడటానికి తమిళ హీరో విజయ్ కూడా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న లియో సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. తెలుగు ప్రేక్షకులు అయితే మూడు సినిమాలు భారీ విజయం సాధించాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ సినిమా అక్టోబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.