జూన్‌లో మోక్షజ్ఞ సినిమా ప్రారంభం

172
balayya-son-mokshagna-cine-entry
balayya-son-mokshagna-cine-entry

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. హీరోగా ఎంట్రీ జూన్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. బాలయ్య పుట్టిన రోజైన 10న మోక్షజ్ఞ సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అయితే.. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారనేది కూడా మొన్నటి వరకు పెద్ద క్వశ్చన్‌ మార్క్‌గా ఉండేది. అయితే.. దీనిపై కూడా క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాను పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌ చేస్తారట.

 

 

మోక్షజ్ఞ కోసం పూరీ ఓ స్టోరీ రెడీ చేశాడని.. అంతేకాదు.. ఇప్పటికే బాలయ్య కూడా ఆ స్టోరీని వినిపించాడట పూరీ. ఆ కథకు బాలయ్య బాబు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మోక్షజ్ఞ మొదటి సినిమానే పాన్‌ ఇండియా లెవల్‌లో ఉండనుందట. కాగా..  ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్వకత్వంలో సినిమా చేయనున్నాడు. వీరి కాంబోలో ఇది మూడో సినిమా కావడం చాలా స్పెషల్‌గా ఉంది. వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు వీరి కాంబోలో రానున్న సినిమా కూడా అదే స్థాయిలో ఫిట్ అవుతుందని ఆశిస్తున్నారు.