bandi sanjay warning to rajamouli regarding rrr movie release

Rajamouli: RRR: రాజమౌళిని ఇప్పుడు RRR వివాదం వెంటాడుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఎన్టీఆర్ టీజర్ విడుదల చేయడంతో అందులోని సన్నివేశాలపై ఓ వర్గం నుంచి వ్యతిరేకత మొదలైంది. దీంతో షూటింగ్ దశలోనే RRR సినిమాపై వివాదాలు టాలీవుడ్ లో టాపిక్‌గా మారింది. కొమురం భీమ్‌ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్.. టీజర్ చివరలో పోషించిన ముస్లిం టోపీని పెట్టుకుని కనిపించడం ఈ వివాదాలకు బీజం వేసింది. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరింత ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఈ ఇష్యూ రచ్చ రచ్చ అవుతోంది.

కొమరం భీమ్‌కు టోపి పెట్టడం ఏంటి రాజమౌళి.. దుమ్ముంటే నీజాం రజాకార్లకు బొట్టు పెట్టి సినిమా తియ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. RRR విడుదలకు అడ్డుకుంటామని, సినిమా రీళ్లను తగలబెడుతామని అన్నారు. అంతటితో ఆగక.. సినిమా విడుదల చేస్తే మీ ఆస్తులను ధ్వంసం చేస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. కాగా ఈ వివాదం ఇంత ముదురుతున్నా రాజమౌళి స్పందించకపోవడం మెగా, నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. చూడాలి మరి రాజమౌళి ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారనేది!.

తాజాగా రాజమౌళి RRR టీం అందరికి వార్నింగ్ ఇచ్చినటు తెలుస్తుంది.. పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ దశలో ఉండగా లీక్స్ ఐనా ఫొటోస్ వీడియోస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రాబ్లెమ్ పేస్ చేసారు , అందుకే ఇపుడు ఎవరైనా ఫొటోస్ లీక్స్ చేస్తే 5000 జరిమానా అలాగే 1 ఇయర్స్ జైలు శిక్ష అని కోర్ట్ లో కేసు దాఖలు చేసారు .. ఇపుడు అదే పనిలో రాజమౌళి కూడా వున్నాడు అని ఫిలిం నగర్ వర్గాలు అనుకుంటున్నారు..