పవన్ కు జై కొట్టిన బండ్ల… దానికోసమేనా?

bandla ganesh comments on pawan kalyan viral on social media
bandla ganesh comments on pawan kalyan viral on social media

(bandla ganesh comments on pawan kalyan viral on social media, Pawan Kalyan pink remake latest news and shooting updates)బండ్ల గణేశ్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా 7’O’ క్లాక్‌ బ్లేడ్‌కి ఫేమ్ తెచ్చిన వ్యక్తిగా అందరికి సుపరిచితుడే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు వీర విధేయుడిగా ఉన్న బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తరువాత ఆ పార్టీలో జాయిన్ అవుతారని అనుకున్నారు. కానీ, పవన్ పార్టీలో కాకుండా అయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి తనకు వల్లమాలిన ప్రేమ అని, ఎన్నికల్లో ఆ పార్టీనే ఘంటాపథంగా గెలబోతుందని జోస్యం చెప్పాారు. కానీ అక్కడ రాణించలేకపోయారు. అక్కడి నుంచి తిరిగి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు, బండ్ల గణేశ్‌ ఎటువంటి స్పెషల్ భక్తుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అంటే తనకు వ్యసనం అని కూడా చెబుతుంటాడు ఈ కమెడియన్ కమ్ నిర్మాత. అయితే రాజకీయాల జోలికి వెళ్లనన్న బండ్ల.. మళ్లీ పొలిటికల్ స్టంట్‌తో సీన్‌లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం చేసినప్పుడు పెద్దగా పవన్ గురించి మాట్లాడానికి ఇష్టపడని ఆయన..ఇప్పుడు ఆయనపై ఏకంగా ట్వీట్ వేశారు. ‘నేను భయంతో రాలేదు – బాధ్యతతో వచ్చాను’ అనే ట్యాగ్‌ లైన్ ఉన్న పవన్ ఫోటోను ‘ఇది నిజం’ అంటూ ఫోస్ట్ చేశారు బండ్ల గణేశ్. ఆ ట్వీట్‌కి జనసేనానిని కూడా ట్యాగ్ చేశారు. సడన్‌గా పవన్‌పై ఈ భక్తుడు ప్రేమను కురిపించడం వెనుక మతలబేమిటా అని చర్చించికుంటున్నారు నెటిజన్లు.

గబ్బర్ సింగ్ వంటి మంచి హిట్ సినిమా తీసిన బండ్ల గణేష్ మరలా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ దొరికితే సినిమా తీయడానికి గణేష్ ప్లాన్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు.