నటుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. గత ఎన్నికల సమయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేసి ఇతర పార్టీలపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు. ముఖ్యంగా ఆయన చెప్పిన 7’O క్లాక్ బ్లేడ్ డైలాగ్ నేటికీ సెన్సేషన్ అవుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బండ్ల గణేష్ రాజకీయాల నుండి తప్పుకున్నాడు. అయినా కూడా ఆయన గత వ్యాఖ్యల వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం రాజకీయాలను దూరంగా ఉంటూ మళ్ళీ సినిమాలతో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రయాణంపై పలు రూమర్స్ షికారు చేస్తున్నాయి. తన పాత వీడియోలను షేర్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేసిన బండ్ల గణేష్ మళ్లీ మళ్లీ సోషల్ మీడియా ద్వారా తన రాజకీయాల గురించి మాట్లాడాడు.నాకు రాజకీయాలతో సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా కొందరు పనిగట్టుకుని మరీ బండ్ల గణేష్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ”నాకు ఏ రాజకీయ పార్టీతో, అలాగే ఏ రాజకీయాలతో సంబంధం లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన” అని బండ్ల గణేష్ స్వయంగా పేర్కొన్నా రూమర్స్ ఆగడం లేదు.
ఇటీవలే తాను ఏ పార్టీలో లేను అంటూ బండ్ల గణేష్ ప్రకటించాడు. అయినా కూడా ఆయన బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ మరోసారి సోషల్ మీడియాలో స్పందించాడు. ”నాకు ఏ రాజకీయ పార్టీలతో ఏ రాజకీయాలతో సంబంధం లేదు నేను రాజకీయాలకు దూరం” అని తెలుపుతూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీ షేర్ చేశారు బండ్ల గణేష్.అయినా జనాలు ఊరుకోవడం లేదు. ఆయన గురించి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే బండ్ల మాటలపై జనానికున్న అభిప్రాయం ఏంటనేది స్పష్టమవుతోంది.