Mahesh Babu starrer Sarileru Neekevvaru's shooting schedules gets wrapped up
Mahesh Babu Sarileru Neekevvaru Title Song-min

‘యంగ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – సూపర్ స్టార్ మహేష్ బాబు’ కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా మొత్తంలో మహేష్ తరువాత ఆ రేంజ్ లో హైలెట్ అయ్యేది బండ్ల గణేషేనట. ఒకరకంగా దూకుడు సినిమాలో బ్రహ్మానందం మహేష్ కాంబినేషన్ సీన్స్, అలాగే క్లైమాక్స్ లో బ్రహ్మానందం ట్రాక్ ఎంత గొప్పగా హిట్ అయ్యాయో… ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా బండ్ల గణేష్ ట్రాక్ ఆ రేంజ్ లో హిట్ అవుతుందట.

ఇక బండ్ల గణేష్ చివరిసారిగా నటుడిగా కనిపించి దాదాపు ఏడు సంవత్సరాలు అయింది. ఎట్టకేలకూ సూపర్ స్టార్ మహేష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో బండ్ల క్యారెక్టర్ కూడా చాల ఫన్నీగా ఉంటుందని తెలుస్తోంది. ఓ అపర కోటీశ్వరుడు అయి ఉండి కూడా కనీస జ్ఞానం లేకుండా పప్పు సుద్దలా.. ఏవేవో మాట్లాడే పాత్రను బండ్ల కోసం అనిల్ రాసాడట. ఇప్పుడు ఆ పాత్రలోనే బండ్ల గణేష్ నటిస్తున్నాడు. మెయిన్ గా బండ్ల హైలెట్ గా వచ్చే రైలు సీక్వెన్స్ సినిమాలోనే చాలా కీలకమైన ఎపిసోడ్ గా ఉంటుందట.

కాగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రకాష్‌ రాజ్‌ , రాజేంద్రప్రసాద్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.