Ram ,ismart shankar, Aadi ,Burra Katha, sree vishnu ,Thippara Meesam,

టాలీవుడ్ లో ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్న స్టోరీ పాయింట్ డబుల్ మైండ్.మైండ్ పెట్టి కథలు రాస్తుంటే మన ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు.అందుకే మన డైరెక్టర్స్ అండ్ రైటర్స్ ఏకంగా మెదడు మీదే కథలు రాస్తున్నారు.

రైటర్ డైమండ్ రత్నబాబు కి డైరెక్టర్ అవుదామన్న ఆలోచన వచ్చినప్పుడు ఒకే మనిషిలో రెండు బ్రైన్స్ ఉంటే ఎలా ఉంటుంది అన్న థాట్ వచ్చింది.కానీ అది కాస్త లీక్ అయ్యి అలా అలా చందు మొండేటి చెవిన పడడం,అది అతనికి నచ్చి సవ్యసాచి కథ రాసుకోవడం జరిగిపోయాయి.దాంతో డైమండ్ రత్నబాబు గొడవకు దిగడంతో సెటిల్మెంట్ కూడా జరిగింది అని అప్పట్లో వార్తలు వచ్చాయి.కానీ సవ్యసాచిలో ఆ పాయింట్ చాలా కన్ఫ్యూసింగ్ గా ఉండడంతో సినిమా రిజల్ట్ రివర్స్ అయ్యింది.సవ్యసాచి ఫెయిల్ అవ్వడంతో తన ఒరిజినల్ కాన్సెప్ట్ కి కాస్త మెరుగులు దిద్ది,మార్పులు చేసి ఆది హీరోగా బుర్రకథ అనే యాప్ట్ టైటిల్ తో తెరకెక్కించాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇది డబుల్ మైండెడ్ వ్యక్తి కథ అని టీజర్ లోనే చెప్పసాడు.ఒకే మైండ్ తో రెండు రకాలుగా ఆలోచించేవాళ్ళని డబుల్ మైండెడ్ అంటారు,కానీ ఇక్కడ మాత్రం రెండు బ్రెయిన్స్ ఒక మైండ్ లో ఉండి,అతను రెండు రకాలుగా ఆలోచించడం అన్నమాట.ఇప్పుడు ఈ ఛాలెంజింగ్ పాయింట్ ని రత్నాబాబు కామెడి యాంగిల్ లో ప్రొజెక్ట్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో జూన్ 28 న తెలుస్తుంది.

ఈ మధ్య హిట్ లేక స్ట్రగుల్ అవుతున్న పూరీ మైండ్ లో కూడా మైండ్ మీద కథ రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.కానీ పూరీ కథలో హీరో అందరిలా నార్మల్ గా ఉంటే కుదరదు కదా.అందుకే రెండు బ్రెయిన్స్ ఉండేలా కథ రాసుకుని ఇస్మార్ట్ శంకర్ అని పేరు పెట్టి,డబుక్ దిమాక్ హైదరాబాదీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.అయితే దానికి మరింత కొత్తదనం ఉండేలా సైంటిఫిక్ థ్రిల్లర్ అనే కలరింగ్ ఇస్తున్నాడు.కానీ మెయిన్ పాయింట్ అయితే డబుల్ బ్రెయిన్స్.మరి బుర్రకథ తరువాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇక్కడితో ఈ డబుల్ మైండ్ ప్రస్థానం ముగిసిపోలేదు.వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ సరయిన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ విష్ణు చాలా నెలల క్రితం తిప్పరా మీసం అనే సినిమా ఓకే చేసాడు.ఆ సినిమా ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది.కానీ ఆ సినిమా గురించి ఇంతవరకు అప్డేట్ లేదు.దానికి కారణం అదే పాయింట్ తో వేరే సినిమాలు కూడా వస్తుండడం.ఆ సినిమాల ఫలితాలు అన్నీ చూసుకుని అప్పుడు తిప్పరా మీసం సినిమాకి మార్పులు చేర్పులు చేసి చూస్తారు.ఆ తరువాత ఆ సినిమాపై డెసిషన్ తీసుకుంటారు.

సరిగ్గా చెబితే డైనమైట్ లా పేలే పాయింట్ ని తీసుకున్న వీళ్ళలో ఎవరు సాలిడ్ హిట్ ఇస్తారో చూడాలి.కానీ ఇక మీద మాత్రం ఈ పాయింట్ అంటే మాత్రం పాత సరుకే.

[INSERT_ELEMENTOR id=”3574″]