అసలు వైకుంఠపురము ఇల్లు ఇదే..!

0
1661
story behind of ala vaikunthapurramuloo house
story behind of ala vaikunthapurramuloo house

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో విడుదలైన మూవీ అల వైకుంఠపురములో. బాక్సాఫీసు వద్ద సంక్రాంతి విన్నర్ అనిపించుకొని భారీ వసూళ్ల దిశగా బన్నీ దూసుకెళ్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అల వైకుంఠపురములో కనిపించే ఇంటి గుట్టు బయటపడింది.

behind the story of ala vaikunthapurramuloo house
behind the story of ala vaikunthapurramuloo house

అల.. వైకుంఠపురములో.. చిత్రంలో కనిపించే ఇల్లు సెట్‌ కాదని తెలిసింది. అయితే అత్తారింటికి దారేది చిత్రం కోసం రామోజీఫిల్మ్‌ సిటీలో త్రివిక్రమ్‌.. ఓ భారీ సెట్‌ వేయించారు. దీంతో ఈ చిత్రంలో ఇంటికి కూడా అలానే సెట్‌ వేశారని అనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని రియల్‌ ఇంట్లోనే షూట్‌ చేశారు. ఓ ప్రముఖ న్యూస్‌ చానల్‌ అధినేత కుమార్తె అత్తింటివారికి చెందిన నివాసం అది. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆ విలాసవంతమైన ఇంటిని ఓసారి అనుకోకుండా చూసిన త్రివిక్రమ్‌.. తన కథకు సరిపడే ఇళ్లు దొరికిందని సంతోషించాడు. సుమారు రూ. 300 కోట్ల విలువచేసే ఆ ఇల్లు అత్యంత విలాసంగా ఉంటుంది. ఎంతలా అంటే ఆ ఇంటి గార్డెన్ లో పూసే పూలకు కూడా పేటెంట్ ఉంది. ఇటలీ నుంచి తెప్పించిన విలువైన మొక్కలు ఆ ఇంట్లో ఉన్నాయి.

వెంటనే యజమానులతో మాట్లాడగానే… అడిగింది మాటల మాంత్రికుడు కదా అని అంగీకరించారు. ఇప్పుడు ఆ ఇల్లు వైకుంఠపురముగా మారి సినిమాలో కీలకంగా నిలిచింది. సుమారు 20 రోజుల పాటు ఆ ఇంట్లో సినిమా షూట్ చేశారు. అయితే ఆ ఇంటిని చూసిన బన్నీకి కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి సంబంధించిన పలు విషయాలను యజమానులను అడిగి తెలుసుకున్నాడు. అదే స్థాయిలో బంజారాహిల్స్ లో ఇంటిని నిర్మించుకోబోతున్నాడు అల్లు అర్జున్ . ఇటీవల ఆ చిత్రం థ్యాంక్స్‌ మీట్‌లో కూడా కొత్తింటి విషయాన్ని ప్రస్తావించాడు. ఆ ఇంటికి తన తండ్రిని డబ్బులు అడుగుతానని కూడా బన్నీ చెప్పాడు. దీంతో ప్రస్తుతం బన్నీ కడుతున్న ఇల్లు ఏ రేంజ్‌లో ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

Previous article‘సిత్తరాలా సిరపడు’ లిరికల్ వీడియో చూశారా ?
Next articleBox office collection status of Sankranthi films 2020