’అల్లుడు అదుర్స్’ షూటింగ్ స్టార్ట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..!

0
453
Bellamkonda Sai Sreenivas Alludu Adhurs Shooting Starts

Bellamkonda Sai Sreenivas Alludu Adhurs Shooting Starts: కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా షూటింగ్స్ లేవు. ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఒక్కో హీరో షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు. ‘రాక్షసుడు’ వంటి హిట్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేషమైన స్పందన వచ్చింది.

Bellamkonda Sai Sreenivas Alludu Adhurs movie poster

గతేడాది రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘రాక్షసుడు’ కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కు మంచి పేరే తీసుకొచ్చింది. తాజాగా ఈ హీరో ఎన్టీఆర్‌తో రభస వంటి ఫ్లాప్ సినిమా తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్దుడు అదుర్స్’ సినిమా స్టార్ట్ చేసాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు ప్రకాష్ రాజ్ పై ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

2021 సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ కి ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లాకొండ శ్రీనివాస్ సరసన నభా నటేష్ – అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ – సోనూసూద్ – వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఐటెం సాంగ్ లో అందాల విందు చేయనుందని సమాచారం.

Previous articleనిశ్శ‌బ్ధం ట్రైల‌ర్ విడుద‌ల
Next articleప్రభాస్ – నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కోసం లెజెండరీ డైరెక్టర్..!