‘టైగర్ నాగేశ్వర్రావు’ ఫుల్ కామెడీ చేస్తాడట !

0
145
Bellamkonda Sai Srinivas, Tiger Nageswara Rao, Latest Telugu News
Bellamkonda Sai Srinivas, Tiger Nageswara Rao, Latest Telugu News

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగతుంది. అయితే సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని గజదొంగగా కామెడీ బాగా చేస్తాడని తెలుస్తోంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు.

మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ బయోపిక్ లో సాయి శ్రీనివాస్ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పాయల్ రాజ్ ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించనుంది. అలాగే సినిమాలో పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటుందట. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఎప్పటి నుంచో హిట్ కోసం ప్రయత్నిస్తున్న సాయి శ్రీనివాస్ కి ఈ సినిమా అన్నా హిట్ ఇస్తోందేమో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here