bellamkonda sai srinivas left from tiger nageswara rao biopic
bellamkonda sai srinivas left from tiger nageswara rao biopic

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. కానీ హీరో మారిపోయాడు. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా ఈ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. సినిమా కూడా మొదలైనప్పటికీ సినిమా నుండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తప్పుకునట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని గజదొంగగా కామెడీ బాగా చేస్తాడట. మరి ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి.

ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ బయోపిక్ లో బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పాయల్ రాజ్ ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించనుంది. అలాగే సినిమాలో పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటుందట. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.