Bellamkonda Sai Srinivas Next Movie With Flop Director Srinu Vaitla
Bellamkonda Sai Srinivas Next Movie With Flop Director Srinu Vaitla

తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాస్ లో మంచి క్రేజ్ నే ఏర్పరుచుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Srinivas). రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈయనతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. ఎందుకంటే ఈయన సినిమాకి కనీసం 16 కోట్ల వరకూ మార్కెట్ ఉంది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ ధర భారీగానే పలుకుతుంది. ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో హిట్ అందుకోవడమే కాకుండా తన నటనతో కూడా ఆకట్టుకున్నాడు సాయి శ్రీనివాస్. అయితే ఇప్పుడు పెద్ద రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

మహేష్ బాబు ఆగడు నుంచి శ్రీనువైట్ల డిజాస్టర్ల పరంపర కొనసాగుతూనే వుంది.. రామ్ చరణ్ తో బ్రుస్లీ, వరుణ్ తేజ్ మిస్టర్, తాజాగా రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ .. దేంతో శ్రీను వైట్ల పనయిపోయిందని, ఇక ఎవరు అవకాశాలివ్వరని అందరు సహజంగానే ఊహించారు. ఆఖరికి మంచు విష్ణు కూడా హ్యాండ్ ఇచ్చాడు అంటే శ్రీనువైట్ల కు ఎంత బ్యాడ్ టైం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీను వైట్ల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి కథ చెప్పటం, అది నచ్చి సాయి ఓకే చేయటం జరిగిపోయిందట… శ్రీను పిక్స్ లో వున్నా తన కార్రేర్ ని మల్లి రిస్క్ చేస్తునాడు అనిపిస్తుంది.. మరి శ్రీనువైట్లతో సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి.