Bellamkonda Srinivas Chatrapathi movie release date: యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ 2005లో విడుదలైన SS రాజమౌళి యాక్షన్ డ్రామా ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌కి వివి వినాయక దర్శకత్వం వహిస్తుండగా, పెన్ స్టూడియోస్ బ్యానర్ దీనిని నిర్మిస్తోంది.
ఛత్రపతి సినిమా అప్డేట్స్ లేకపోవడంతో చాలామంది ఆగిపోయింది అనుకున్నారు ,కానీ ఇప్పుడు మేకర్స్ ఛత్రపతి రిలీజ్ డేట్ (Chatrapathi release date) ని లాక్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ముంబై బీచ్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. షూట్ లొకేషన్ నుండి కొన్ని వర్కింగ్ చిత్రాలు ఈ మధ్యాహ్నం బయటకు వచ్చాయి.
బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) ప్రధాన పాత్రలో నటిస్తున్న చత్రపతి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు రిలీజ్ కి భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు హిందీ రీమేక్ అయిన చత్రపతి సినిమాని మే 5న విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాని నిర్మిస్తున్న పెన్ స్టూడియోస్ బ్యానర్ విడుదలను అలాగే ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేయటానికి రాంగ్ కూడా సిద్ధం చేశారంట. రాబోయే రెండు మూడు వారాల్లో ఈ సినిమాకు సంబంధించిన డైలీ అప్డేట్స్ విడుదల చేస్తారని ఇప్పుడు ఫిలింనగర్లో టాక్ వినబడుతుంది. ఇంకొన్ని రోజులు ఆగితే ఈ సినిమాలో ఎవరెవరు పని చేస్తున్నారా అనే విషయం అందరికీ తెలుస్తుంది.