bellamkonda srinivas rakshasudu Telugu Review, Rating
bellamkonda srinivas rakshasudu Telugu Review, Rating

విడుదల తేదీ : ఆగస్టు 02, 2019
రేటింగ్ : 3/5
నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల, శరవణన్, వినోద్ సాగర్, రాధా రవి.
దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాత‌లు : సత్యనారాయణ కోనేరు
సంగీతం : జిబ్రాన్
సినిమాటోగ్రఫర్ : వెంకట్ సి దిలీప్
ఎడిటర్ : అమర్ రెడ్డి

అల్లుడు శ్రీనుతో మొదలు పెట్టి..ఐదు సంవత్సరాలుగా సక్సెస్ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . గతంలో కూడా ఒక తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేసిన అతనికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఈసారి కూడా మరో తమిళ సినిమాను రీమేక్ ఎటమ్ట్ చేశాడు. తమిళ రాక్షసస్ కథను నమ్మి. రమేష్ వర్మకు ఛాన్స్ ఇచ్చాడు. అనుపమా పరమేశ్వరన్.. జిబ్రాన్… వెంకట్ సి దిలీప్ లాంటి టాలెంటడ్ టెక్నీషయన్స్.. ఈ సినిమాకు పనిచేయడంతో.. సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్లు థ్రిల్లింగ్ గా.. ఇంట్రస్టింగ్ గా ఉండటంతో ఆ బజ్ మరింత పెరిగింది. అలా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాక్షసుడు థ్రిల్లింగ్ గా అనిపించాడా లేక బోర్ కొట్టించాడా.. బెల్లంకొండ శ్రీనివాస్ కోరుకున్న హిట్ వచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సినిమా డైరక్టర్ గా సక్సెస్ అవ్వాలని తన జర్నీని స్టార్ట్ చేసిన అరుణ్.. ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో.. ఇంట్లో వాళ్ల కోరిక మేరకు ఇస్టం లేకపోయినా.. ఎస్ఐగా తన కెరీర్ ను స్టార్ట్ చేస్తాడు. ఆ జాబ్ లో జాయిన్ అయిన అతను… ఒక సైకో కిల్లర్.. 15 ఏళ్ల అమ్మాయిలను హత్య చేస్తుంటాడు.. పోలీసులకు సవాలుగా మారిన ఆ కేసు వెనుక మిస్టరీ ని అరుణ్ ఎలా చేదించాడు. ఇంతకీ ఆ మర్ధర్స్ చేసిన సైకో కిల్లర్ ఎవరు అతని కథేంటి.. అతని గతం ఏంటీ.. అనేది సినిమా చూసి తెలుసుకోవాలస్సిందే…

నటీనటులు:

గత సినిమా సీతలో నటనపరంగా కూడా నెగెటీవ్ మార్కులు వేయించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్. ఈ రాక్షసుడు సినిమాలో మాత్రం తనకు పర్ఫెక్ట్ గా.. సెట్ అయ్యే కాప్ క్యారక్టర్ ను ఎంచుకున్నాడు.. ఓవర్ బిల్డప్ లు.. హై ఓల్టేజ్ యాక్షన్ కు పోకుండా.. థ్రిల్లింగ్ , ఇంట్రస్టింగ్ గా కనిపించే.. కథలో ఇమిడిపోయి నటించాడు.. ఇలాంటి క్యారక్టర్ ను ఎంచుకుంటే మంచి విజయాలు దక్కించుకుని హీరోగా.. నిలబడడటం కాయం.. ఒక రకంగా రాక్షసుడు సినిమాకు బెల్లంకొండ శ్రీనివాస్ ప్లస్ అయ్యాడు అని చెప్పోచు.. ముందు నుంచి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తున్న అనుపమా పరమేశ్వరన్ కు చాలా లిమిటెడ్ రోల్ దక్కింది. స్కూల్ టీచర్ గా కనిపించిన అనుపమ.. తనకున్న తక్కువ సీన్స్ లోతే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాజీవ్ కనకాలతో పాటు మిగతా నటీనటులంతా.. తమ పాత్రల పరిధి మేరకు నటించారు..

టెక్నీషియన్స్:

ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయిన రమేష్ వర్మ, తమిళ్ లో హిట్ అయ్యిన సినిమాను రీమేక్ గా ఎంచుకున్నాడు. ఐతే కథలోని థ్రిల్లింగ్ మిస్ కాకుండా ఉండేందుకు పెద్దగా కథలో మార్పులు చేర్పులు చేయలేదు.తమిళ సినిమాలోని మ్యాజిక్ కు రీ క్రియేట్ చేయలేకపోయినా.. పర్వాలేదు అనిపించేలా రాక్షసుడిని మిలిచాడు. ఓరిజినల్ వర్షన్ లోని చాలా సిన్స్ ను యాజిటీజ్ గా.. వాడటం వల్ల సినిమా కు కూడా కలిసోచ్చింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాను ఎలివేట్ చేసే జిబ్రన్ ఈసినిమాకు బాగా సపోర్ట్ అందించాడు.. పాటలలో పెద్దగా స్కోప్ లేకపోయినా.. తన ఆర్ ఆర్ తో సినిమాను మరో స్థాయికి తీసెకెళ్లాడు.. మఖ్యంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేయడంలో జిబ్రాన్ 100% సక్సెస్ అయ్యాడు. ఇక సినిమాటోగ్రాఫర్ వెంకట్ సి దిలీప్ కెమెరా పనితనం సినిమాకు ఎసెట్ గా మారింది. సినిమా మూడ్ ని నిలబెడుతూ.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను అతను క్యాప్చర్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు బాగున్నాయి..

ఫైనల్ గా:

తమిళ సినిమా రాక్షసన్ రీమేక్ గా తెరకెక్కిన రాక్షసుడు.. థ్రిల్లర్ సినిమాలు ఇస్టపడే వారికి నచ్చేలా.. ఆజోనర్ కు లిమిటెడ్ అపిల్ ఉండటంతో, మరో పక్కా ఒకటి రెండు మాస్ సినిమాలు కూడా థియేటర్స్ లో ఉండటంతో రాక్షసుడు సినిమా కలక్షన్ల పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.. కాకపోతే లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కి, డీసెంట్ బిజినెస్ జరుపుకోవడంతో .. బాక్సాఫీస్ వద్ద కలక్షన్స్ రాబట్టే అవకాశాలు ఎక్కువున్నాయి.

బోటమ్ లైన్:థ్రిల్ చేసే రాక్షసుడు