Homeసినిమా వార్తలుభగవంత్ కేసరి Day 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

భగవంత్ కేసరి Day 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

Bhagavanth Kesari 1st day collection, Bhagavanth Kesari day 1 box office collection report, Bhagavanth Kesari movie collection, Nandamuri Balakrishna, worldwide box office collections.

Bhagavanth Kesari 1st day collection, Bhagavanth Kesari day 1 box office collection report, Bhagavanth Kesari movie collection, Nandamuri Balakrishna, worldwide box office collections.

బాలకృష్ణ (nandamuri balakrishna) అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి మొదటిసారిగా కలిసి చేసిన సినిమా భగవంత్ కేసరి((Bhagavanth Kesari)) అత్యంత భారీ అంచనాల నడుమ ఈరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవడం జరిగింది. దాదాపు 1400 ధియేటర్లో విడుదలైన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 7.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు భగవంత్ కేసరి మొదటి రోజు కలెక్షన్స్ (Collection) ఎలా ఉన్నాయో చూద్దాం.

బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమాలో శ్రీ లీల కీలకమైన పాత్ర చేసిన విషయం తెలిసిందే. విడుదలక ముందు సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ విడుదలైన తరువాత మొదటిరోజు ప్రేక్షకుల నుండి అనుకున్నంత స్థాయిలో హిట్ టాక్ అయితే తెచ్చుకోలేకపోయింది. దర్శకుడు అనిల్ రావిపూడి తన కామెడీ టైమింగ్ ని పక్కన పెట్టి ఎమోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తరాకెక్కించటం కూడా కొంతమందికి ఆకట్టుకున్నప్పటికీ చాలామంది డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది.

ఇక 1400 థియేటర్ లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు 13 కోట్ల షేర్ కలెక్షన్స్ (Day 1 Collection) అటు ఇటుగా రాబట్టే అవకాశాలు ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. భగవంత్ కేసరి సినిమాని వీరసింహారెడ్డి సినిమాతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ నే చెప్పాలి.. దానితోపాటు బాలకృష్ణ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన అఖండ సినిమా చూసుకుంటే సిమిలర్ గా ఉందని చెప్పవచ్చు.

ఒకవేళ గనుక ఈ సినిమా నైట్ షోస్ జోరు పెరిగితే లెక్కలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.. దానితోపాటు ఓవర్సీస్ లో కూడా సినిమా విడుదలకు ముందు స్లో బుకింగ్స్ నడిచాయి.. ఆ తర్వాత కొంచెం బుకింగ్స్ పెరిగాయి. విజయ్ లియో మూవీ వల్ల బాలకృష్ణ సినిమాకి కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో పోటీ తప్పలేదు. ఇక మొదటి రోజు పూర్తి అయ్యే టయానికి బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ జోరు చూపిస్తుందో చూడాలి.