Homeసినిమా వార్తలు‘భగవంత్ కేసరి’ నుంచి హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్ విడుదల

‘భగవంత్ కేసరి’ నుంచి హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్ విడుదల

Bhagavanth Kesari First Song Ganesh Anthem Released, Balakrishna and Sreeleela first lyrical song released from Bhagavanth Kesari movie, Anil Ravipudi, kajal Aggarwal

‘భగవంత్ కేసరి’ మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో అలరించారు. ఈరోజు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు.

గణేష్ పాట కోసం ఎస్ఎస్ థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్‌ని కట్టిపడేసింది. కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా అలపించారు.

బాలకృష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్‌ లు, గెటప్‌ లు , డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి. విజువల్స్ అద్భుతంగా వున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. పోస్టర్లు, ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ పాట అందుకుంది.

సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.

Bhagavanth Kesari First Song Ganesh Anthem Released, Balakrishna and Sreeleela first lyrical song released from Bhagavanth Kesari movie, Anil Ravipudi, kajal Aggarwal

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY