Homeసినిమా వార్తలుభగవంత్ కేసరి ట్రైలర్ కి అంతా సిద్ధం.. చీఫ్ గెస్ట్ వీళ్లే..!

భగవంత్ కేసరి ట్రైలర్ కి అంతా సిద్ధం.. చీఫ్ గెస్ట్ వీళ్లే..!

Balakrishna and Anil Ravipudi next Bhagavanth Kesari Trailer releasing on October 8th, Bhagavanth Kesari Trailer review and public, Bhagavanth Kesari trailer event chief guest details,

Balakrishna and Anil Ravipudi next Bhagavanth Kesari Trailer releasing on October 8th, Bhagavanth Kesari Trailer review and public, Bhagavanth Kesari trailer event chief guest details,

NBK – Bhagavanth Kesari Trailer: అఖండ, వీర సింహారెడ్డి  భారీ విజయాలను సాధించిన తర్వాత బాలకృష్ణ అలాగే అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి.  యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తర్కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల (Sreeleela) ముఖ్యమైన పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే.  బాలకృష్ణ సరసన మొదటిసారిగా కాజోల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తుంది..  భగవంత్ కేసరి ట్రైలర్ ని అక్టోబర్ 8న వరంగల్ లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.  అయితే ఈ ట్రైలర్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ముగ్గురు డైరెక్టర్లు రాబోతున్నట్టు సమాచారమైతే అందుతుంది. 

అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాపై ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన భగవంత్ కేసరి రెండు సాంగ్స్ అలాగే టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.. అలాగే అనిల్ రావిపూడి మొదటిసారిగా బాలకృష్ణతో (Balakrishna) సినిమా చేయడం వల్ల సినిమాపై మరింతహైప్  రావడం జరిగింది. 

మామూలుగానే అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాలు తీయటంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.  అలాగే మరోవైపు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగానే క్రియేట్ చేస్తారు.  ఇక భగవంత్ కేసరి ట్రైలర్ విషయానికి వస్తే రేపు విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ కి చీఫ్ గెస్ట్ గా దర్శకుడు బాబి అలాగే గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి ఇప్పటికే వరంగల్ కి బయలుదేరినట్టు సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారము.  

అయితే ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని మళ్లీ బాలకృష్ణ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక భగవాన్ కేసరి సినిమా విషయానికి వస్తే ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ పోస్టర్ అలాగే టీజర్ యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు అనిల్ రావిపూడి మళ్లీ తన మార్పుని క్రియేట్ చేశారు.  తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ విలన్ రోల్ లో చేస్తున్నారు. అక్టోబర్ 19న విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.