Bhagavanth Kesari Trailer, Bhagavanth Kesari Trailer Public talk, Bhagavanth Kesari Trailer Review, Nandamuri Balakrishna, Sreeleela, Kajal Aggarwal, Anil Ravipudi, Bhagavanth Kesari business.
నందమూరి బాలకృష్ణ హీరోగా అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో లేటెస్ట్ గా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాని అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే సినిమా రెండు సాంగ్స్ భారీగా హిట్ అయ్యాయి.. ఆదివారం రోజు వరంగల్లో భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల చేయడం జరిగింది..
ఇక భగవంత్ కేసరి ట్రైలర్ చూసుకుంటే అమాంతం యాక్షన్ అలాగే డైలాగులతో దుమ్ము దులిపేశారు బాలకృష్ణ. అనిల్ రావిపూడి అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలాగే మరో పక్క యాక్షన్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్లే కెపాసిటీ తన డైరెక్షన్ కి ఉంది.. దానికి తగ్గట్టుగానే భగవంత్ కేసరి ట్రైలర్లో ఒకవైపు డైలాగులు యాక్షన్ మరోవైపు ఫ్యామిలీ సెంటిమెంట్ తో సహా ట్రైలర్ మొత్తం నింపేశారు దర్శకుడు.
ఈ భగవంత్ కేసరి ట్రైలర్ కాస్త రొటీన్‌గానే ఉన్నా కూడా ఫ్యాన్స్‌కు మాత్రం పిచ్చెక్కించేలా ఉంది. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈసారి మాత్రం దర్శకుడు అనిల్ రావిపూడి కి పక్కా ఇండస్ట్రీ హిట్ అంటున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్.

శ్రీ లీల ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో చేస్తున్న గా కాజల్ అగర్వాల్ బాలకృష్ణ కి జోడిగా నటిస్తుంది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విధంగా చేస్తున్నారు. ట్రైలర్ను బట్టి చూస్తే తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి హైలెట్గా నిలుస్తుంది అని అర్థమవుతుంది. ఇక అక్టోబర్ 19న విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి .