ప్రభాస్ తల్లిగా టాప్ హీరోయిన్..కొత్త ట్విస్ట్

0
498
Bhagyashree to play Prabhas's mother in his next film
Bhagyashree to play Prabhas's mother in his next film

(Radhe Shyam movie latest updates: Bollywood heroine to play Prabhas’s mother in his next Radhe Shyam film)ప్రభాస్ కెరీర్‌లో ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా తర్వాత సాహో రూపంలో ఊహించని డిజాస్టర్ వచ్చిచేరింది. దీంతో ఆ విషయాన్ని మరిపించేలా మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టారు యంగ్ రెబల్ స్టార్. ‘జిల్‌’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ (వర్కింగ్ టైటిల్) సినిమా సెట్స్ పైకి వచ్చేశారు ప్రభాస్. తాజాగా రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న ప్రభాస్ సినిమా టైటిల్ విషయంలో ఎడతెగని ఉత్కంఠ సాగుతూనే ఉంది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమాకి ఫైనల్ గా జాన్ టైటిల్ నే సెట్ చేస్తారనే టాక్ ఉంది.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ లో మూడు కోట్లతో వేసిన కాస్ట్లీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.ఆ కాస్ట్లీ సెట్ లో మొర్రాకో టైల్స్ తో వేసిన ఫ్లోరింగ్. యాంటిక్ పియానో.. ఖరీదైన కార్పెట్స్ వాడారట. అయితే ఈ సినిమా మొదటినుండి ది 70లలో పిరియాడికల్ లవ్ స్టొరీ గా ఉండబోతుంది అనే ప్రచారం జరుగుతుంది. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ మాత్రం ఇది 70లలో పిరియాడికల్ లవ్ స్టొరీ కాదని. కానీ కొత్త తరహా ప్రేమకథ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించేందుకు గాను ఓ టాప్ హీరోయిన్‌ని తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీని ప్రభాస్ తల్లిగా యాక్ట్ చేయిస్తున్నారు మేకర్స్. ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈమె ‘ప్రేమ పావురాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘రాణా’లో భాగ్యశ్రీ నటించింది. మళ్లీ ఇంతకాలం ఇలా ప్రభాస్ తల్లిగా ప్రేక్షకుల ముందుకు రానుంది భాగ్యశ్రీ. గత వారం రోజుల నుంచి జరుగుతున్న షూటింగ్‌లో ప్రభాస్‌, భాగ్యశ్రీనలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. బుధవారంతో భాగ్యశ్రీకి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ విడుదల విడుదల కాబోతున్న ‘జాన్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.