Bharadwaja Thammareddy comments on George Reddy movie

‘జార్జి రెడ్డి’.. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాను మరీ కమర్షియల్ గా తీశారంటూ కొందరు వాదిస్తున్నారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదని చెబుతున్నారు.. సెకండ్ హాఫ్ బోర్ కొట్టిందని చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం. అయితే చాలామంది జార్జి రెడ్డి ఎవరు అని తెలుసుకోవాలని సినిమాకు వెళుతున్నారు. జార్జి రెడ్డి బ్రతికి ఉన్న సమయంలో దగ్గరుండి చూసిన వాళ్లలో టాలీవుడ్ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఒకరు. జార్జిరెడ్డిని తన కారులో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వద్ద డ్రాప్ చేసి వచ్చిన 2 గంటలకే అతడి చావు వార్త వినాల్సి వచ్చిందని ఓ ఛానల్ కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇక సినిమా చూశాక ఆయన ఎన్నో షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. జార్జ్ రెడ్డి పేరు ఉస్మానియా యూనివర్శిటీ నేపథ్యం వాడుకున్నారు తప్ప ఒరిజినల్ జార్జ్ రెడ్డి కథ కు ఈ సినిమా కు చాలా వ్యత్యాసం ఉందని ఆయన బాంబు పేల్చారు. జార్జి రెడ్డి సినిమాను చాలా కమర్షియల్ గా తీశారని.. ఎన్నో విషయాలు కల్పితం అనే చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి భరద్వాజ్. ముఖ్యంగా సినిమాను కమర్షియల్ ఫార్ములాలో తెరకెక్కించాలని భావించారని.. అందుకోసం ఉన్నవీ లేనివీ చూపించారని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. తాను సినిమా షూటింగ్ సమయంలోనే ఇవి గమనించానని ఆయన అన్నారు.

సినిమాలో ఉన్నదానికి.. నిజంగా జరిగిన దానికి ఆయన చెప్పిన తేడాలు:

జార్జ్ అసలు ఆవేశ పరుడు కాదట..

జార్జ్ రెడ్డికి ఆర్ట్స్ కాలేజ్ కు సంబంధం లేదట..

జార్జ్ రెడ్డి అసలు హాస్టల్ లో ఉండేవాడు కాదట.. యూనివర్శిటీ పక్కన రూంలో ఉండేవాడు..

జార్జ్ రెడ్డి అసలు గొడవలకు వెళ్లేందుకు ఇష్టపడేవాడు కాదు..

చదువు పై ఉన్న ఆసక్తి తో తోటి విద్యార్థుల కు కూడా చదువు చెప్పేవాడు..