‘భీమ్లా నాయక్’ నుంచి ఫస్టు సింగిల్..!

0
1475
Thaman about Bheemla Nayak First Single

Bheemla Nayak Song: ఇప్పుడు ఎక్కడ చూసినా మూవీ లవర్స్ అంతా పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానుల హంగామాతో పాటుగా తన సినిమాల నుంచి కూడా అదిరే అప్డేట్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో పవన్ నటిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” కూడా ఒకటి.

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. తన సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ ను అందించడంలో తమన్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ సినిమా నుంచి రేపు రానున్న ఫస్టు సింగిల్ ఒక రేంజ్ లో ఉంటుందనీ, ఈ సాంగ్ చేసే సందడి మామూలుగా ఉండదని చెప్పుకొచ్చాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చిన ఆ సాంగ్ యూత్ ను ఊపేయడం ఖాయమని చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan Bheemla Nayak Birthday new poster

మరి ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ట్రాక్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే రేపు ఉదయం 11 గంటల 16 నిమిషాల వరకు వేచి ఉండాల్సిందే. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుంది. మరో ప్రధానమైన పాత్రలో రానా నటిస్తుండగా, కథానాయికల పాత్రలలో నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

భీం భీం భీం భీం భీమ్లానాయక్.. సాంగ్‌ అదిరిందిగా..! 

 

Previous articleమొదలు కానున్న “బిగ్ బాస్ 5” కంటెస్టెంట్స్ లిస్ట్..!
Next article‘థ్యాంక్యూ’ తో అలరించేందుకు సిద్ధమైన అక్కినేని హీరో..!