భీమ్లా నాయక్ మూవీ రివ్యూ: మాస్ ఫీస్ట్

Bheemla Nayak Review in Telugu

రేటింగ్ 3.75/5
నటీనటులు పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సమ్యుక్త మీనన్
దర్శకులు సాగర్ కె చంద్ర
నిర్మాత సూర్య దేవర నాగ వంశీ
సంగీతం ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ రవి కె చంద్రన్
బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్

పవన్ కళ్యాణ్ అలాగే రానా దగ్గుబాటి మొట్ట మొదటిసారిగా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాలో నిత్యామీనన్‌, సంయుక్తమీనన్‌ హీరోయిన్లుగా ఏం చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా మా తమిళంలో హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం పదండి..

కథ
భీమ్లా నాయక్ సినిమా మా తమిళంలో హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎస్సై భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాన్ నటిస్తాడు. ఆర్మ రిటాయర్డ్ హవల్దార్ డాని, డానియల్ శేఖర్ పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తాడు. ఇద్దరి పర్ఫామెన్స్ నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో డాని భీమ్లా నాయక్ కు పట్టుబడతాడు. డానీని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు.

అయితే కథ మొత్తం అక్కడి నుంచే మలుపు తిరిగి భీమ్లా నాయక్ పోలీస్ ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. అంతిమంగా డాని, భీమ్లా నాయక్ మధ్య జరిగే గడవ, ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈగోల యుద్ధంలో సుగుణ (నిత్యా మీనన్) ఎలా చిక్కుకుంది. . అలాగే తనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది..? నిత్యా మీనన్ ని పవన్ కళ్యాణ్ కేసు నుండి ఎలా బయట పడేస్తాడు..? అలాగే మళ్ళీ పోలీస్ జాబు వస్తుందా..? అనేవి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
పవన్ కళ్యాణ్ ఎనర్జీకి, హైపర్ యాక్టివ్ పర్ఫామెన్స్ ఇచ్చారు ఈ సినిమాలో, ఎస్సై భీమ్లా నాయక్ పాత్రలో పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఎవరూ చేయలేరు అన్నట్టు ఇంకొక సారి నిరూపించారు. దానికి తగ్గట్టుగానే రానా దగ్గుబాటి కూడా పవన్ కళ్యాణ్ కి దీటుగా తన పర్ఫామెన్స్ ని నిరూపించుకున్నాడు ఇంకొకసారి.

Bheemla Nayak movie review in telugu
Bheemla Nayak movie review in telugu

ఈ సినిమాలో నిత్యామీనన్‌ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. త్రివిక్రమ్ రాసుకున్న స్టోరీకి నిత్యా మీనన్ న్యాయం చేసిందనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ అయినా సంయుక్తమీనన్‌ కూడా తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. అలాగే మిగిలిన వారు హైపర్ ఆది, మురళి శర్మ, సునీల్, మిగిలిన వారు వాళ్ల పాత్రలకు న్యాయం చేయడం జరిగింది.

- Advertisement -

సాంకేతిక అంశాలు:
మొదటినుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం తో మ్యూజిక్ చేసే తమన్ ఈ సినిమా కూడా న్యాయం చేశాడనే చెప్పాలి. తమన్ అందించిన సాంగ్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ఉపయోగపడ్డాయి. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మంచి క్లాస్ లుక్ ని తీసుకు వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అడవి సీన్స్ హైలెట్ గా ఉంటాయి.

ఇక మాటల మాంత్రికుడు అయినా త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు అలాగే స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. అందరూ అన్నట్టుగానే ఈ సినిమాకి త్రివిక్రమ్ బ్యాక్ బోన్ అని చెప్పాలి. తన మాటలతో అందర్నీ సినిమాలో లీనమై అయ్యేటట్టు చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథనం మొత్తం తెలుగు నేటివిటీలో మార్కెట్ వల్ల సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

Pawan Kalyan Bheemla Nayak Telugu Review
Pawan Kalyan Bheemla Nayak Telugu Review

అలాగే ప్రొడ్యూసర్ సంబంధించిన ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి. ఏ విషయంలోనూ తగ్గకుండా సినిమా ఎంత అందంగా చూపించాలో ప్రొడ్యూసర్స్ కష్టం సినిమాలో తెలుస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్
రానా దగ్గుబాటి
ప్రీ క్లైమాక్స్
యాక్షన్ ఎపిసోడ్ లు

మైన‌స్ పాయింట్స్:
నెమ్మదిగా సాగే మొదటి భాగం
అవసరం లేని కొన్ని సీన్లు

Bheemla Nayak Review from twitter
Bheemla Nayak Review from twitter

విశ్లేషణ:
సినిమా షూటింగ్ దగ్గర్నుంచి మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి అలాగే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా కలిసి నటిస్తున్న ఈ సినిమాని తమిళంలో హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.

అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సాగర్. అలాగే భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ కూడా ఎటువంటి విలువలు తగ్గకుండా.. పవన్ కళ్యాణ్ అలాగే రానా దగ్గుబాటి ఎదురయ్యే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, స్టోరీని ఎలా మార్చుకోవాలి అన్ని విధాల కష్టపడి ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది.

Bheemla Nayak Telugu Movie Review and Rating
Bheemla Nayak Telugu Movie Review and Rating

పవన్ కళ్యాణ్ లాగా రానా దగ్గుబాటి ల మధ్య యాక్షన్ సీన్స్ తో సినిమాని మొదలు పెట్టడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో రానా దగ్గుబాటి ని వేముల నాయక్ అరెస్టు చేయడం జరుగుతుంది. ఒరిజినల్ సినిమాతో పోలిస్తే భీమానాయక్ తెలుగు భాషల్లో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి అలాగే రాణా కి సరిపోయేటట్టు స్టోరీని మార్చడం జరిగింది.

మొదటి భాగం మొత్తం పవన్ కళ్యాణ్ అలాగే రానా మధ్య జరిగే సీన్స్ కొంచెం నిదానంగా అనిపిస్తుంది అలాగే అక్కడక్కడ అవసరం లేని కామెడీ సీన్స్ పెట్టడం జరిగింది. మొదటిభాగంలో మురళి శర్మ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగానే ఆకట్టుకుంటాయి. కొంచెం బోరింగ్గా అనే ఫీల్ అయ్యే టైంకి డైరెక్టర్ సాగర్ సినిమాని ఇంటర్వెల్ తీసుకువస్తారు.

ఇంటర్వెల్ ముందు జరిగే ప్రీ క్లైమాక్స్ సీన్స్ సినిమాకి హైలెట్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అలాగే రానా మధ్య జరిగే పోటీతో రెండో భాగం మొదలవుతుంది. ఇద్దరి మధ్య జరిగే పోటీలు పవన్ కళ్యాణ్ పోలీస్ జాబ్ ని కోల్పోవటం జరుగుతుంది అలాగే నిత్యా మీనన్ ఓ కేసులో అరెస్ట్ చేస్తారు. అలాగే రెండో భాగంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

Bheemla Nayak Pre Release Event Postponed
Bheemla Nayak Pre Release Event Postponed

డైరెక్టర్ సాగర్ అలాగే త్రివిక్రమ్ స్టోరీ ని మార్చటంలో చాలానే కష్టపడ్డారు. సెకండాఫ్ ఇంటర్వెల్‌లో ప్రారంభించిన మాస్ యాక్షన్‌పై ఊపందుకుంది. ఒకదాని తర్వాత మరొకటి ఎలివేషన్ సన్నివేశాలు అభిమానులనే కాకుండా మాస్ సినిమా ప్రేమికులను కూడా అలరిస్తాయి.

మొత్తం సినిమా చాలా అద్భతంగా వచ్చింది. కుటుంబం మొత్తం కలిసి ఒక్క సారి చూడదగ్గ సినిమా. భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ ను చాలాబాగా తెరకెక్కించారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రానా మరో సారి తన బాహుబలిలో భల్లాలను గుర్తు చేశారు. మళయాలంలో కన్న తెలుగులోనే బాగుందనిపిస్తుంది. రెండు మూడా సార్లు కూడా ఈ సినిమా చూడొచ్చు.

Related Articles

Telugu Articles

Movie Articles

భీమ్లా నాయక్ మూవీ రివ్యూ: మాస్ ఫీస్ట్Bheemla Nayak Telugu Review: మొత్తం సినిమా చాలా అద్భతంగా వచ్చింది. కుటుంబం మొత్తం కలిసి ఒక్క సారి చూడదగ్గ సినిమా. భీమ్లా నాయక్ ఫ్లాష్ బ్యాక్ ను చాలాబాగా తెరకెక్కించారు. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రానా మరో సారి తన బాహుబలిలో భల్లాలను గుర్తు చేశారు. మళయాలంలో కన్న తెలుగులోనే బాగుందనిపిస్తుంది. రెండు మూడా సార్లు కూడా ఈ సినిమా చూడొచ్చు.