Chiranjeevi Bholaa Shankar Trolls: ఆచార్య మూవీ తో తిరిగి ఇండస్ట్రీ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగా స్టార్….వాల్తేరు వీరయ్య మూవీ తో ఇప్పటికీ తన ఫామ్ ను అందుకోవడం కుర్ర హీరోలకు కూడా కష్టం అని ప్రూవ్ చేశారు. అదే జోష్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ త్వరలో ‘భోళా శంకర్’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు.
Chiranjeevi Bholaa Shankar Trolls: ఈ మూవీ లో కీర్తీ సురేష్ చిరు సిస్టర్ పాత్ర పోషిస్తుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కు మెహర్ రమేష్ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ మిక్స్డ్ టాక్ మీ అందుకు ఉంటుంది. ఎంతో కోలాహాలంగా విడుదల చేసిన టీజర్ మెగా ఫ్యాన్స్ ని కాస్త డిసప్పాయింట్ చేసింది అని చెప్పవచ్చు.
చిరంజీవి మూవీ అంటేనే డైలాగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయో తెలుసు…మరి అలాంటిది మాస్ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాల్తేరు వీరయ్య రేంజ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేసిన చిరు ఫ్యాన్స్ తెలంగాణ స్లాంగ్ లో సాగదిసినట్లుగా ఉన్న చిరంజీవి డైలాగ్స్ విని నీరసించి పోయారు.షికారు కొచ్చిన షేర్‌ను బే’, ‘ఇస్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే. ఆల్ ఏరియాస్ అప్నా హే. నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు.. దేక్‌లేంగే’ లాంటి డైలాగ్స్ కంటెంట్ బాగున్నప్పటికీ దాన్ని కన్వే చేసిన విధానం వల్ల అవి డీలా పడిపోయాయి.

మెగాస్టార్ మూవీ అంటే కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి అనుకున్నవారికి ఈ టీజర్ లో సన్నివేశాలు ఇంతకుముందు ఎన్నో మూవీస్ లో చూసినా అనుభూతి కలిగింది. ఆన్లైన్లో అత్యధికమైన వ్యూస్ సొంతం చేసుకున్నప్పటికీ టీజర్ లోని చిరు డైలాగ్స్ పై మీమ్స్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా చిరంజీవి పలికిన డైలాగ్స్ వచ్చిరాని తెలంగాణ యాసలో ఉండడంతో చిరంజీవి మార్క్ పంచ్ అందులో మిస్ అయింది. చిరంజీవి స్టైల్ కు సెట్ అయ్యే స్లాంగ్ లో మంచి మాస్ డైలాగ్స్ పెడితే ఇంకా బాగుండేది అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.