చిరంజీవి ప్రస్తుతం వేదాళం రీమిక్స్ సినిమాతో మన ముందుకు వస్తున్న విషయం తెలిసింది. మన తెలుగు నెగెటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో మార్పులు చేసినట్టు దర్శకుడు మెహర్ రమేష్ చెప్పటం జరిగింది. బోలా శంకర్ పేరుతో ఈ సినిమాని ఆగస్టు 11న విడుదలకు సిద్ధం చేశారు. ఇప్పటికే విడుదలైన భోలా శంకర్ టీజర్, ట్రైలర్ అలాగే సాంగ్స్ సినిమాపై భారీగానే అంచనా ఏర్పడేటట్టు చేశాయి. భోలా శంకర్ బిజినెస్ కూడా దాదాపు 90 కోట్లు జరిగినట్టు ట్రేడ్ వర్గాల నుంచి వెళ్తున్న సమాచారం.
వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్టు సాధించిన చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్ తో బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరిగి రాయాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో గత ఐదు సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ విధంగా ఉన్నాయి. వాల్తేరు వీరయ్య’ సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.90 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 88 కోట్ల బిజినెస్ చేయగలిగింది. విడుదలైన పది రోజుల్లోనే ఈ సినిమా బ్రేకింగ్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక దీని ముందు సినిమా ‘గాడ్ ఫాదర్’ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు.. 12.97 కోట్ల షేర్ రాబట్టింది. అయితే 74 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 14 కోట్ల నష్టాలను తీసుకొచ్చింది బాక్సాఫీస్ వద్ద. ఇక చిరంజీవి అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా మొదటి రోజు 29.50 కోట్ల షేర్ రాబట్టింది. 132.50 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 84 కోట్ల నష్టాలను తీసుకువచ్చింది.

సైరా నరసింహారెడ్డి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 43.45కోట్ల నష్టాలను తీసుకొచ్చింది. ఇక బోలా శంకర్ విషయానికొస్తే మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తున్న అనే విషయంపై ఇప్పటికే సోషల్ మీడియాలో అలాగే ట్రేడ్ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది. ఈ సినిమా బిజినెస్ కూడా 90 కోట్లు జరిగినట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ ఐదు సినిమాల బిజినెస్ పరంగా చూసుకుంటే 100 కోట్ల బిజినెస్ దాటిన ఏ సినిమా చిరంజీవికి నష్టాలు తీసుకురాటమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి.
తమన్నా అలాగే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన భోళా శంకర్ సినిమా చిరంజీవికి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ తీసుకువస్తుందో చూడాలి. ఏది ఏమైనా 60 యేళ్ల పై పడిన వయసులో చిరు ఈ రేంజ్ వసూళ్లు దక్కించుకోవడం మాములు విషయం కాదనే చెప్పాలి.