Bhoom Bhaddhal Lyrical Video Song Released From Ravi Teja Krack

Ravi Teja Krack Bhoom Bhaddhal Song: మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘క్రాక్’ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. దీపావళి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ‘భూమ్ బద్దల్’ లిరికల్ వీడియో సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో అప్సరా రాణితో రవితేజ రొమాన్స్ మాస్ అభిమానులకు కిక్కిస్తోంది.

అంచనాలకు తగ్గట్లుగా ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ అప్పీలింగ్ సాంగ్‌ను అందించారు. మంగ్లీ, సింహా పాడిన ఈ ఫాస్ట్ బీట్‌కు రామ్ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. రవితేజ, అప్సరా రాణి మాస్ పర్‌ఫార్‌మెన్స్ ప్రేక్షకలోకాన్ని హుషారెత్తిస్తోంది. తొలిసారి ఐటెం సాంగ్ చేసిన అప్సర.. ఈ లిరికల్ వీడియో చూస్తుంటే ఈ ఐటెం సాంగ్‌తో వెండితెరను షేక్ కావడం ఖాయం అని తెలుస్తోంది.టెర్రిఫిక్ డాన్సర్ అయిన రవితేజ విజిల్స్ వేసే విధంగా డాన్స్ చేయగా, అప్సరా రాణి అందాలు కనువిందు చేసే రీతిలో ఉన్నాయి. ఈ పాటకు జాని మాస్టర్ సూపర్బ్ కొరియోగ్రఫీ చేశారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ ‘క్రాక్’ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తుండగా, ఆయన సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీర్చిదిద్దుతున్నారు. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో రవితేజ- గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన ”డాన్‌ శీను, బలుపు” సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ హ్యాట్రిక్ మూవీపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.