Bhumika Chawla, Tollywood Movie News, Telugu Cinema Actress
Bhumika Chawla, Tollywood Movie News, Telugu Cinema Actress

ఒకప్పుడు తెలుగులో ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టిన భూమిక పెళ్లయిన తరువాత కొన్ని రోజులు నటనకి దూరం అయ్యింది.కానీ చాలామందిలానే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.MS ధోని, MCA సినిమాల్లో లీడ్ యాక్టర్స్ కి అక్కగా,వదినగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన భూమికకు సమంత నటించిన యు టర్న్ సినిమాలో ఘోస్ట్ క్యారెక్టర్ దక్కింది.

అయితే మిగతా సినిమాల్లా భయపెట్టే దెయ్యంగా కాకుండా ఎమోషనల్ ఘోస్ట్ గా ఆ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ గా నిలిచింది.సెకండ్ ఇన్నింగ్స్ లో భూమికకు వస్తున్న సినిమాలే అంతమాత్రంగా ఉన్నాయి అంటే ఆ పాత్రలన్నీ దెయ్యలకి సంబంధించినవే కావడం మరొక విశేషం.ప్రస్తుతం ఆమె తమిళ్ లో రెండు సినిమాల్లో నటిస్తుంది భూమిక.కొలైయతిర్ కాలం,కన్నై నంబాదే ఈ రెండు సినిమాలు కూడా హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించినవే.అలానే హిందీ లో ఫ్రైడే రిలీజ్ గా వస్తున్న ఖామోషి కూడా థ్రిల్లర్ అయినప్పటికీ హారర్ టచ్ ఉంటుంది.

ఈ సినిమాలో తమన్నా మెయిన్ లీడ్ అయినా భూమిక కి కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది.వస్తున్న కొన్ని ఆఫర్స్ కి నో చెప్పలేక ఘోస్ట్ క్యారెక్టర్స్ కి కూడ ఓకే చెబుతుంది భూమిక.మరి ఆమెకి ఈ ఆత్మ గోల తప్పి మంచి పాత్రలు ఎప్పుడు పడతాయో.